ప్రస్తుతం కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమతమయ్యారు. ఇప్పటికే 30 రోజులుగా ఇంట్లోనే ఉంటున్న తారలు అభిమానులతో మీడియా ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇటీవల రాజమౌళి, చిరంజీవి లాంటి వారు కూడా పలు మీడియా సంస్థలతో లైవ్‌లో మాట్లాడుతూ ఆసక్తి విషయాలను వెల్లడించారు. తాజాగా సీనియర్ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఓ టీవీ చానల్ తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

యాంకర్‌, కీరవాణిని మీ కుటుంబ సభ్యుల్లో మీకు నచ్చిన విషయాలు నచ్చని విషయాలు చెప్పాలని కోరాడు. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కీరవాణి. రాజమౌళి ఓ పని అనుకుంటే ఆ పరి చేయటంలో తను చూపించే ఏకాగ్రత నాకు ఎంతో ఇష్టమని చెప్పిన కీరవాణి, ఎప్పుడు రాజమౌళి చిన్న పిల్లల సినిమాలు చూస్తాడని ఆ విషయం నాకు నచ్చదని చెప్పాడు. అంతేకాదు కీరవాణి ఏదైనా సినిమా చూడమని జక్కన్నకు సూచించినా ఆ సినిమాలు చూడకుండ పెండింగ్ పెడతాడని చెప్పాడు కీరవాణి.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రాజమౌళి కీరవాని ఆర్‌ఆర్ఆర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆగిపోవటంతో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. అదే సమయంలో తదుపరి చిత్రాలపై చర్చల జరపటంతో పాటు ఫ్యామిలీతో కలిసి ఆనందంగా సమయం గడుపుతున్నారు.