గత సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సరం రోజున  అక్షయ్ కుమార్‌, విద్యాబాలన్, తాప్సీ,సోనాక్షి సిన్హా ముఖ్యపాత్రల్లో నటించిన ‘మిషన్ మంగళ్’ బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జగన్ శక్తి డైరెక్ట్ చేసాడు. తాజాగా ఈ దర్శకుడు ముంబయిలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా.. ఉన్నట్టుండి అమాంతం కుప్పకూలి పోయాడు.

దాంతో ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీ మెంబర్స్ ఆయన్ని వెంటనే దగ్గరలోని హాస్పటిల్ తరలించారు. డాక్టర్స్ ఆయన్ని పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టడంతో   కుప్పకూలినట్టు చెప్పుకొచ్చారు.దాంతో జగన్ శక్తి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, స్నేహితులు, ముంబైకి చేరుకున్నారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్టు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వ్యాఖ్యానించారు.  

ప్రముఖ సీరియల్ యాక్టర్ కన్నుమూత

జగన్ శక్తి..'చీనీ కమ్' సహా పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశారు. అలా జగన్‌ శక్తి గతంలో హాలీడే, ఇంగ్లీష్ వింగ్లీష్, డియర్ జిందగీ చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2019లో రిలీజ్‌ అయిన 'మిషన్ మంగళ్' చిత్రంతో ఆయన డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించటంతో ఆయన పేరు అంతటా మారు మ్రోగిపోయింది. మొదటి చిత్రంతోనే జగన్ ఎన్నో అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం జగన్ శక్తి, తన తదుపరి చిత్రం కోసం అక్షయ్ కుమార్ తో చర్చలు జరుపుతున్నారు.