మోడలింగ్ లో రాణించే అందాల భామలకు సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ మోడలింగ్ లో ఉండే అందరికి ఆ అవకాశం దక్కదు. మోడల్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటేనే సినిమా అవకాశాలు వస్తాయి. అందాల పోటీల్లో ప్రపంచ సుందరిగా నిలిస్తే వచ్చే క్రేజే వేరు. 2017లో 22 ఏళ్ల కుర్ర భామ మానుషీ చిల్లర ప్రపంచ సుందరిగా కిరీటాన్ని దక్కించుకుంది. 

ఐశ్వర్య రాజ్, ప్రియాంక చోప్రా, సుస్మిత సేన్ లాంటి నటీమణులంతా ప్రపంచ సుందరి కీర్తి కిరీటాన్ని దక్కించుకున్నవారే. వీరంతా బాలీవుడ్ ని ఎలేశారు. ప్రస్తుతం అందరి దృష్టి లేటెస్ట్ సెన్సేషన్ మానుషీ చిల్లర్ పియా పడింది. హర్యానాకు చెందిన ఈ కుర్ర భామ సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. 

ఆ సమయం రానే వచ్చింది. అద్భుత అవకాశం వస్తేనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే మానుషీ చిల్లర్ కోరిక నెరవేరింది. హిస్టారికల్ చిత్రంలో స్టార్ హీరో సరసన నటించే అవకాశాన్ని మానుషీ చిల్లర్ దక్కించుకుంది. 

యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మాణంలో ప్రముఖ మహారాజు పృథ్విరాజ్ చౌహన్ జీవిత చరిత్ర తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పృథ్విరాజ్ గా ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్నాడు. ఆయన ప్రేయసి సంయోగిత పాత్రలో మానుషీ చిల్లర్ అవకాశం దక్కించుకుంది. 

పృథ్విరాజ్ చౌహాన్ అంటే అసామాన్య ధైర్య సాహసాలకు ప్రతీక. ఈ చిత్రాన్ని చంద్రప్రకాష్ ద్వివేది దర్శకుడు.దర్శకుడు మాట్లాడుతూ సంయోగిత పాత్ర కోసం తాము అనేక అందమైన భామలకు ఆడిషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. సంయోగిత పాత్రలో నటించే అమ్మాయి చాలా అందంగా ఉండాలి. మానుషీ చిల్లర్ ఆ పాత్రలో సరిపోతుందనిపించింది. అందుకే ఆమెని ఎంపిక చేసినట్లు తెలిపారు. 

మానుషీ చిల్లర్ కూడా ఈ పాత్రని ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఈ చిత్రానికి సైన్ చేసిన వెంటనే హోమ్ వర్క్ ప్రారంభించింది. గత వారం నుంచి సంయోగిత పాత్రలో ఒదిగిపోయేందుకు మానుషీ రిహార్సల్స్ చేస్తోంది అని దర్శకుడు తెలిపారు. 

తనకు ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా ఆదర్శం అని మానుషీ తెలిపింది. మనీషి చిల్లర్ కు కూచిపూడి నృత్యంలో కూడా మంచి ప్రావీణ్యం ఉంది. ప్రపంచ సుందరిగా అందరి దృష్టిని ఆకర్షించిన మానుషీ నటిగా బాలీవుడ్ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.