మహబూబ్ నగర్ లోని తిరుమల సినిమా థియేటర్ లో సాహూ సినిమా విడుదల సందర్భంగా బ్యానర్ కడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్  కు గురై హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెంకటేష్ కుటుంబానికి మానవతా దృక్పథంతో ఆపన్న హస్తం అందించి ఆసరాగా నిలిచారు రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారు.

మహబూబ్ నగర్ కు చెందిన వెంకటేష్ గాయపడి వారి కుటుంబం మెరుగైన చికిత్స, మందుల కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నా విషయాన్ని తన అనుచరులతో తెలుసుకొని వెంకటేష్ కుటుంబానికి ఆసరాగా నిలిచారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.

మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ గారి చొరవతో చిత్ర పంపిణీదారులు, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో  మాట్లాడి వెంకటేష్ కుటుంబానికి రూ. 7 లక్షల సాయం ను అందించి ఆర్థికంగా తోడ్పాటు అందించారు. 

ఈ సందర్భంగా వెంకటేష్ తల్లి నీలమ్మకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా చెక్కు ను అందించారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు, సినిమా థియేటర్ యజమాని సురేష్ కుమార్ లు పాల్గొన్నారు.