'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ మెహ్రీన్ పిర్జాద. అమ్మడిని మొదటిసారి చూసిన చాలా మంది ఈజీగా క్లిక్కవుతుందని కితాబిచ్చారు. తప్పకుండా స్టార్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తుందని అనుకున్నారు. పైగా మొదటి సినిమా అనంతరం మెహ్రీన్ కి వచ్చిన ఆఫర్స్ కూడా అన్ని ఇన్ని కావు.

15కి పైగా సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. నెల గ్యాప్ లోనే కేవలం 6 సినిమాలకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆమెపై పాజిటివ్ వైబ్రేషన్స్ డోస్ మరింత మెరిగింది. కానీ బేబీ ఆ తరువాత డిజాస్టర్స్ తో హ్యాట్రిక్ లు అందుకోవడం స్టార్ట్ చేసింది. ఐరెన్ లెగ్ అని టాక్ వస్తున్న క్రమంలో 'మహానుభావుడు' కాస్త ఉరటనిచ్చాడు.  కానీ ఆ గెలుపు క్షణాలు అమ్మడికి ఎక్కువ రోజులు ఉండలేదు. మొత్తానికి F2 సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్టందుకున్న బేబీకి మళ్ళీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.

కానీ ఆ సినిమాలు కూడా అమ్మడికి ఎలాంటి క్రేజ్ ని అందించలేకపోయాయి. చాణక్య సినిమాతో డిజాస్టర్ గా నిలవగా.. సంక్రాంతి కానుకగా వచ్చిన ఎంత మంచివాడవురా సైతం దెబ్బకొట్టింది.  ఇక రీసెంట్ ఆ వచ్చిన అశ్వద్ధామ అయిన సక్సెస్ ఇస్తుందేమో అనుకుంటే.. ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా క్లిక్కవ్వడం లేదు. మొత్తంగా బేబీ చేస్తున్న సినిమాలు ఒకటి హిట్టయితే వరుసగా మరో మూడు సినిమాలు ప్లాప్ అవుతున్నాయి. మరీ మెహ్రీన్ నెక్స్ట్ సినిమాలతో అయినా సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.