మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లి గూడెంలో ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. మెగాస్టార్ వస్తున్నారని తెలిసి పరిసర ప్రాంతాల ప్రజలు తాడేపల్లిగూడానికి భారీగా తరలి వచ్చారు. పోలీసులు జనాలని అదుపుచేసేందుకు చాలా కష్టపడ్డారు. ఇక విగ్రహావిష్కరణ అనంతరం మెగాస్టార్ తన ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

 అంత గొప్ప మహానటుడి గురించే చెప్పే అర్హత తనకు లేదని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇక తనను ముఖ్య అతిధిగా పిలిచి ఇలాంటి కార్యక్రమంలో భాగం చేసినందుకు నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలని అన్నారు. అలాగే పొలిసు శాఖకు కూడా ప్రత్యేక ధన్యవాధాలు తెలుపుతూ తన కోసం ఇంత దూరం తరలివచ్చిన తెలుగు అభిమానులను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పారు.  

ఫైనల్ సైరా సినిమా కూడా మంచి విజయం సాధించిందని చరిత్ర అంచున దాగి ఉన్న ఒక స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితకథను సైరాగా చూపించడం జరిగింది అంటూ ఆ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మెగాస్టార్ మాట్లాడారు. వేడుక అనంతరం మెగా అభిమానులను చిరంజీవి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఇక వేదిక వెనకాల ఉన్న మహిళా అభిమానులను కూడా చిరంజీవి ప్రత్యేక అభివాదం తెలిపారు.