మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా మళ్ళీ తన గత వైభవాన్ని చూపించాలని అనుకుంటున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా ట్రై చేసిన హిస్టారికల్ 'సైరా' క్లిక్కవ్వకపోవడం మెగాస్టార్ ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది.

ఇక నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ 152వ సినిమా తెరకెక్కతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరేవేగంగా జరుగుతోంది. ఇక సినిమాకు ఆచార్య అనే టైటిల్ ని సెట్ చేసిన విషయం తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమాకు సంబందించిన రిలీజ్ డేట్ పై గతకొన్ని రోజులుగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.

ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఆచార్య సినిమా దసరా సెలవుల్లో రాబోతున్నట్లు సమాచారం. హాలిడేస్ మొదలుకాబోయే ఒక రోజు ముందే సినిమాని రిలీజ్ చేయాలనీ మెగాస్టార్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్టు టాక్ వస్తోన్న విషయం తెలిసిందే.