సైరా సినిమాతో ఊహించని రిజల్ట్ అందుకున్న మెగాస్టార్ తదుపరి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని చాలా కష్టపడుతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ తో సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో మెగాస్టార్ చిరంజీవి నక్సలైట్ గా కనిపించబోతున్నాడని సమాచారం. ఇటీవల విడుదలైన ఒక ఫోటో కూడా గాసిప్స్ కి మరింత బలాన్ని చేకూర్చింది.

ఇక కొరటాల డైరెక్ట్ చేస్తున్న సినిమా తరువాత మెగాస్టార్ మరొక సినిమాను కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. అసలు మ్యాటర్ లోకి వస్తే.. తండ్రి కోసం లూసిఫర్ హక్కుల్ని సొంతం చేసుకున్న రామ్ చరణ్ ఆ సినిమాని ఎలాగైనా తెలుగులో రీమేక్ చేయాలని అనుకుంటున్నాడు. ఈ ఏడాదిలోనే సెట్స్ పైకి తేవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అయితే ఆ సినిమాకు వివి.వినాయక్ డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ కూడా ఒక చేయి వేయనున్నట్లు టాక్ వచ్చింది.

ఇక ప్రాజెక్ట్ కెప్టెన్ గా వినాయక్ ని ఫైనల్ చేసేందుకు మెగాస్టార్ ఆలోచిస్తునట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం వినాయక్ ఫామ్ లో లేడు.  ఖైదీ నెంబర్ 150  మెగాస్టార్ క్రేజ్ కి తగ్గట్టు తెరకెక్కించినప్పటికీ ఆ తరువాత చేసిన ఇంటిలిజెంట్ సినిమా డిజాస్టర్ అయ్యింది. బాలకృష్ణ తో మరో సినిమా చేయాలనీ అనుకున్నాడు. కానీ స్క్రిప్ట్ నచ్చక సినిమాని సెట్స్ పైకి తీసుకురాలేదు. ఇక ఇప్పుడు లూసిఫర్ రీమేక్ వినాయక్ చేతుల్లో పెట్టేందుకు మెగాస్టార్ ఆలోచిస్తున్నట్లు టాక్. మరీ ఆ నమ్మకాన్ని వినాయక్ ఎంతవరకు నిలుపుకుంటాడో చూడాలి.