మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సైరా సినిమాతో భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినప్పటికీ మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ అందుకున్నారు. సినిమా ఇంకాస్త మెప్పించగలిగి ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలయ్యేవని చెప్పవచ్చు. అయితే అదే ఆలోచనతో రాబోయే ప్రాజెక్ట్ విషయంలో మెగాస్టార్ జాగ్రత్తలు తీసుకోనున్నారట.

కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తోన్న సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అంటే అన్ని భాషల్లో రిలీజ్ చేస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బడ్జెట్ విషయంలో కూడా ఏ మాత్రం లిమిట్స్ లేకుండా సినిమాని నిర్మించబోతున్నారట/. దాదాపు 150కోట్లతో సినిమాని కాస్ట్లీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ ఒక నక్సలైట్ పాత్రలో కనిపించబోతున్నాడు. అలాగే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కూడా కనిపించబోతున్నట్లు టాక్ వస్తోంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కూల్ గా కనిపించే మెగాస్టార్ సెకండ్ హాఫ్ లో ఊహించని విధంగా యాక్షన్ మోడ్ లో మంచి ఎమోషన్ ని క్రియేట్ చేసే పాత్రలో నటించబోతున్నారట.  ఇక  ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే విషయంలో దర్శకుడు కొరటాల ఇటీవల మెగాస్టార్ తో చర్చలు జరిపారట.

త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇక వీలైనంత త్వరగా సమ్మర్ ఎండింగ్ లో సినిమాను పూర్తి చేసి ఆగస్ట్ లో రిలీజ్ చేయాలనీ మెగాస్టార్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కొరటాల కూడా ఆ డేట్ ని లాక్ చేసుకొని తన  షెడ్యుల్స్ లో మార్పులు చేసుకున్నట్లు సమాచారం. కరెక్ట్ గా ఆగస్ట్ 15న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తున్నారట.

అసలైతే సైరా సినిమాని ఈ ఏడాది ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కానీ షూటింగ్ కారణంగా కుదరలేదు. ఇక 2020లో అయినా ఇండిపెండెన్స్ డే ని ఏ మాత్రం మిస్ చేసుకోవద్దని మెగాస్టార్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లిమిట్స్ పెట్టలేదట. నిర్మాత రామ్ చరణ్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మెగాస్టార్ 152 ప్రాజెక్టుని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.