మెగాస్టార్ చిరంజీవి.. జగన్ ని కలవడానికి అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అపాయింట్మెంట్ ఖరారు చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సీఎం జగన్ తో చిరంజీవి, రామ్ చరణ్ భేటీ అవుతారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ భేటీ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

ఈ నెల 14 న ముఖ్యమంత్రి జగన్ ని మెగాస్టార్ చిరంజీవి కలవనున్నట్లు సమాచారం.  చిరు- జగన్ ల లంచ్ భేటీ పై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ మొదలైంది.  సైరా సినిమా వీక్షించమని కోరేందుకే ఆంటోన్న అధికార వర్గాలు  కొన్ని కారణాల దృష్ట్యా రేపటి భేటీ 14 కి వాయిదా వేసినట్లు సమాచారం. 

చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాను వీక్షించాల్సిందిగా చిరంజీవి.. జగన్ ని కోరనున్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత చిరంజీవి కలవడం ఇదే తొలిసారి. కాబట్టి జగన్ కి శుభాకాంక్షలు చెప్పడంతో పాటు 'సైరా' విడుదల సమయంలో స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినందుకు జగన్ కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నారట.  

ఇటీవల చిరంజీవి 'సైరా' సినిమాను చూడాలని తెలంగాణా గవర్నర్ సౌందరరాజన్ ను చిరంజీవి కోరారు. ఆమె తన కుటుంబంతో కలిసి సినిమా చూసి అధ్బుతంగా ఉందంటూ ప్రశంసించారు.