మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల సైరా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో చూశాం. త్వరలో మరో భారీ సెలెబ్రేషన్స్ కు మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాంచరణ్ నిర్మాణంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన కలల ప్రాజెక్ట్ సైరా చిత్రం విడుదలై విజయం సాధించడంతో చిరంజీవి చాలా సంతోషంగా ఉన్నారు. 

అదే ఉత్సాహంతో తన చేతులమీదుగా మరో కార్యక్రమం జరగాలని చిరంజీవి భావిస్తున్నారట. 80వ దశకంలోదక్షణాది నుంచి అద్భుతమైన నటులు, నటీమణులు స్టార్స్ గా ఎదిగారు. 80వ దశకంలో హీరోలు, హీరోయిన్లంతా తరచుగా గెట్ టుగెదర్ అవుతున్న సంగతి తెలిసిందే. 

ఇలా గెట్ టు గెదర్ అయ్యే కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏడాదితో పదేళ్లు పూర్తవుతోంది. 'ఎయిటీస్ రీ యూనియన్' అని దీనిని పిలుచుకుంటున్నారు. ఈ ఏడాది గెట్ టుగెదర్ ని మరింత ఘనంగా తన నివాసంలోనే ఏర్పాటు చేయాలని చిరంజీవి భావిస్తున్నారట. 

నవంబర్ 23న ఈ ఈవెంట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ లో సౌత్ లో అగ్ర నటులైన రజనీకాంత్, బాలకృష్ణ, మోహన్ లాల్, అర్జున్, శరత్ కుమార్, సుమన్, భానుచందర్, రాధ, సుహాసిని, జయసుధ, విజయశాంతి, రాధిక లాంటి సీనియర్ నటులంతా జహారు కాబోతున్నట్లు తెలుస్తోంది.