మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ తన 152వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై మెగాస్టార్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. సైరా సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సారి మంచి సోషల్ మెస్సేజ్ ఉన్న పాయింట్ తో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. 

ఇంతవరకు అపజయం లేని కొరటాల శివ కూడా గత సినిమాల కంటే చిరు 152 ప్రాజెక్ట్  కోసం ఎక్కువ కష్టపడుతున్నారు. సినిమా స్క్రిప్ట్ మెగాస్టార్ ఒకే చేసేదాకా చాలా సార్లు మార్చరట. ప్రస్తుతం సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్పీడందుకున్నాయి. అయితే మెగాస్టార్ సైరా సినిమా విషయంలో చాలా వరకు బాధ్యతలన్నీ రామ్ చరణ్ పైనే ఉంచాడు. కానీ ఆ సినిమాని ఫ్యాన్ ఇండియన్ లెవెల్లో రామ్ చరణ్ ప్రజెంట్ చేయలేకపోయాడు.

నమిత స్టన్నింగ్ లుక్స్.. వైరల్ అవుతున్న హాట్ ఫోజులు!

దీంతో ఈ సారి కొరటాల సినిమా విషయంలో మెగాస్టార్ పూర్తిగా చరణ్ ని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. సినిమా ప్రతి విషయంలో మెగాస్టార్ తన అభిప్రాయాన్ని దర్శకుడితో చర్చిస్తున్నారట. మరోవైపు చరణ్ కూడా RRRతో బిజీగా ఉండడంతో సినిమా ప్రొడక్షన్ పనులు కూడా పూర్తిగా తండ్రి మెగాస్టార్ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.

రీసెంట్ గా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ మ్యూజిక్ కోసం మణిశర్మ - కొరటాల శివతో కలిసి బ్యాంకాక్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడే ప్రశాంతంగా సినిమాకు సంబందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి పాటల ట్యూన్స్ వరకు అన్ని పనులను అక్కడే ఫినిష్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నారట. మరి ఈ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.