దాదాపు ఒకటిన్నర దశాబ్దానికి పైగా చిరంజీవి ఉయ్యాలవాడ జీవిత చరిత్రని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. ఇన్నాళ్లకు చిరంజీవి కల నెరవేరింది. సైరా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న సైరా చిత్రం అద్భుతమైన వసూళ్లు రాబడుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో సైరా కలెక్షన్ల షేర్ 50 కోట్ల మార్క్ దాటింది. మూడు రోజుల్లో సైరా చిత్రం రెండు రాష్ట్రాల్లో 54 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దీనితో కేవలం మూడురోజుల్లోనే సైరా చిత్రం 50 శాతానికి పైగా రికవరీ సాధించినట్లైంది. తెలుగు రాష్ట్రాల్లో సైరా థియేట్రికల్ హక్కులు 107 కోట్లకు అమ్ముడయ్యాయి. 

ఏరియాలవారీగా గమనిస్తే.. నైజాంలో 14 కోట్లు, సీడెడ్ లో 9 కోట్లు, ఉత్తరాంధ్రలో 7, గుంటూరులో 6, ఈస్ట్ లో 5.7, వెస్ట్ లో 4.6 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఇక వీకెండ్ శని, ఆదివారాల్లో సైరా వసూళ్లు శుక్రవారం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ట్రేడ్  వేస్తున్నారు. అదే సమయంలో సైరా చిత్రం నేడు విడుదలవుతున్న గోపీచంద్ చాణక్య నుంచి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

మెగాపవర్ స్టార్ రాంచరణ్ దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ లో సైరా చిత్రాన్ని నిర్మించాడు. నయనతార హీరోయిన్ గా నటించగా అమితాబ్, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు.