Asianet News TeluguAsianet News Telugu

బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫోన్ చేసిన చిరంజీవి ?

ఇటీవల జరిగిన సినీ పెద్దల సమావేశానికి బాలకృష్ణ ఆహ్వానించకపోవడం వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త మెగా వర్సస్ నందమూరిగా మారుతోంది.

Megastar Chiranjeevi phone call to Balayya
Author
Hyderabad, First Published Jun 5, 2020, 9:21 AM IST

ఇటీవల జరిగిన సినీ పెద్దల సమావేశానికి బాలకృష్ణ ఆహ్వానించకపోవడం వివాదంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం కాస్త మెగా వర్సస్ నందమూరిగా మారుతోంది. తనని సమావేశానికి ఎవరూ ఆహ్వానించలేదని, వీళ్లంతా కూర్చుని భూములు పంచుకునేందుకు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారా  అని బాలయ్య ఘాటుగా స్పందించారు. 

దీనితో బాలకృష్ణపై పెరిగాయి.అలాగే బాలయ్యని సపోర్ట్ చేస్తూ చిరంజీవిని కూడా కొందరు విమర్శించారు. ఈ వివాదం తర్వాత ఓ ఇంటర్వ్యూలో బాలయ్య మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ బిల్డింగ్ కోసం డల్లాస్ లో ఈవెంట్ నిర్వహించారు. 5 కోట్లు సేకరించారన్నారు. చిరంజీఇవ్ చిరంజీవి కూడా వెళ్లడుగా.. ఆ 5 కోట్లు ఏమయ్యాయి.. బిల్డింగ్ కట్టారా అని బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 

వివాదం ముదురుతున్న నేపథ్యంలో చిత్ర పరిశ్రమలో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలికేందుకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇండస్ట్రీలో అందరం కలసి వెళ్లాలని, అవసరం అయితే మీరు కూడా రావాల్సి ఉంటుందని బాలయ్య కు చిరంజీవి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. 

చిరంజీవి మాటలు విన్నాక బాలయ్య కూల్ అయ్యారని, ఇక ఈ వివాదం ముగిసినట్లే అని ప్రచారం జరుగుతోంది. మరో వాదన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా ప్రభావాన్ని కూడా లెక్క చేయకుండా ఇండస్ట్రీ కోసం ప్రభుత్వం తో చర్చలు జరుపుతుంటే తనపైనే నిందలు వేస్తున్నారని, దీనితో కొంతకాలం పాటు ఇండస్ట్రీ సమావేశాలకు దూరంగా ఉండాలి చిరంజీవి నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios