మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో సెకండ్ సినిమాతో అయినా మంచి విజయాన్ని అందుకోవాలని కష్టపడుతున్నాడు. మొదట విజేత అనే సినిమాతో సింపుల్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ నటనపరంగా పరవాలేధనిపించాడు. కానీ సినిమా కమర్షియల్ గా క్లిక్కవ్వలేదు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. కళ్యాణ్ సెకండ్ మూవీ తెలుగుతో పాటు కన్నడలో కూడా రిలీజ్ కానుందట. మెగా వారసులకు అక్కడ మంచి మార్కెట్ ఉండడంతో కళ్యాణ్ దేవ్ కూడా కన్నడలో ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. 'సూపర్ మచ్చి' అనే టైటిల్ ని సెట్ చేసుకున్న ఈ హీరో కన్నడలో మాత్రం మరో డిఫరెంట్ టైటిల్ ని సెట్ చేసుకున్నాడు. 

మీనాక్షి అనే టైటిల్స్ ఫిక్స్ చేసినట్లు ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల విడుదల చేశారు.దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని టాక్ వచ్చింది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

ఇప్పుడు ఆ నిర్మాత సినిమా చేయలేనని పక్కకి తప్పుకున్నట్లు రూమర్స్ రాగా ఇపుడు కన్నడలో కూడా సినిమాను విడుదల చేస్తున్నట్లు చెప్పడంతో అవన్నీ అబద్ధాలని ఒక క్లారిటీ వచ్చింది. ఇక వీలైనంత త్వరగా షూటింగ్ ని పూర్తి చేసి సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసుకుంటున్నారు. వాక్స్ ఏడాది సమ్మర్ లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.