మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఎంతోమంది సంగీత దర్శకులతో పనిచేసారు. చిరంజీవి చిత్రాల్లో పాటలు ఉర్రూతలిగించడమే కాదు వినసొంపుగా పదేపదే వినాలనిపించే విధంగా కూడా ఉంటాయి. ఇక 90వ దశకం చివరి నుంచి మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు ఎక్కువగా మణిశర్మ సంగీతం అందించారు. 

వీరి కాంబోలో చూడాలని ఉంది. అన్నయ్య , ఠాగూర్, ఇంద్ర లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చాయి. ఇదిలా ఉండగా మణిశర్మ, చిరు కాంబోలో వచ్చిన చివరి చిత్రం స్టాలిన్. దాదాపు 14 ఏళ్ల తర్వాత మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో తెరక్కుతున్న ఆచార్య చిత్రానికి మణిశర్మనే సంగీత దర్శకుడు. 

తాజాగా చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతోంది. ' పాటలు చిత్రీకరించే సమయంలో నేను సంగీతం ఎంజాయ్ చేస్తాను. మధ్య మధ్యలో ఆపడం నాకు ఇష్టం ఉండదు. కానీ గత కొన్ని రోజులుగా నేను ఓపాటని పాస్ చేయడం.. తిరిగి వినడం చేస్తున్నాను. అందుకు కారణం మీరు రేపు ఉదయం 9 గంటలకు తెలుసుకుంటారు అంటూ అభిమానులని మెగాస్టార్ సస్పెన్స్ లోకి నెట్టాడు. ఆచార్య చిత్రంలోని పాటని రిలీజ్ చేస్తారేమోనని అంతా భావిస్తున్నారు. 

అదే కనుక జరిగితే 14 ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం మణిశర్మ స్వరపరిచిన పాటని అభిమానులు వినొచ్చు.