సూపర్ స్టార్ మహేష్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై క్రమంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగానే మహేష్ సినిమా అంటే అభిమానుల్లో ఒక రేంజ్ లో అంచనాలు ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచాయి. 

విడుదల సమయం దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ కు రెడీ అవుతోంది. తాజాగా చిత్ర యూనిట్ 'ల్యాండ్ మార్క్ అనౌన్స్మెంట్' పేరుతో ఫ్యాన్స్ పండగ చేసుకునే ప్రకటన చేసింది. మెగాస్టార్ చిరంజీవి సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. మీరు ఇంతవరకు ఎన్నో ఈవెంట్స్ చూసి ఉంటారు. కానీ ఇది మెగా సూపర్ ఈవెంట్ అని చిత్ర యూనిట్ ఆసక్తికరమైన వీడియో రిలీజ్ చేసింది. 

టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయేలా సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ ని జనవరి 2న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ప్రకటనతో అటు మెగాస్టార్ ఫ్యాన్స్, ఇటు మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ మేజర్ గా నటించనున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన తొలిసారి మహేష్ తో రొమాన్స్ చేస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.