టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్ లో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైరా సినిమా అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ కాకపోవడంతో నెక్స్ట్ సినిమాతో అయినా బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలుకొట్టాలని ప్లాన్ చేసుకుంటున్నారు. స్క్రిప్ట్ మొదటి నుంచి పక్కా ప్లాన్ తో రెడీ అవుతున్న కొరటాలకు రీసెంట్ గా మెగాస్టార్ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మంచి ఈవెంట్ తో టైటిల్ ఎనౌన్స్ చేయాలనీ అనుకున్న కొరటాల ప్లాన్ మొత్తం ఆదిలోనే వృధా అయ్యింది. అందుకు కారణమైన మెగాస్టార్ క్షమాపణ చెప్పక తప్పలేదు. రీసెంట్ గా ఒక సినిమా వేడుకలో ఆచార్య టైటిల్ రివీల్ చేసిన విషయమా తెలిసిందే. అసలు మ్యాటర్ లోకి వస్తే.. సినిమా రిలీజ్ డేట్ పై కూడా త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  సినిమాకు రిలీజ్ డేట్ పై గత కొంతకాలంగా అనేక రకాల వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

ఫైనల్ గా కొరటాల ఒక స్పెషల్ డేట్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 15వ తేదీన ఇండిపెండెన్స్ డే సందర్బంగా సినిమాను విడుదల చేయాలనీ చిత్ర యూనిట్ ఆలోచిస్తోందట. ఇప్పటికే సగం షూటింగ్ పనులను పూర్తి చేసుకున్న కొరటాల ఫస్ట్ లుక్ ని రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరీ ఆ లుక్ అభిమానులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.