Asianet News TeluguAsianet News Telugu

1962 నాటి ఫోటోను భద్రంగా దాచుకున్న చిరంజీవి

ఈ రోజు హనుమజ్జయంతి సందర్భంగా తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో చిరు కోసం బాపు గీసి ఇచ్చిన హనుమంతుని ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు చిరు.

Megastar Chiranjeevi About Hanuman Jayanthi
Author
Hyderabad, First Published Apr 8, 2020, 10:39 AM IST

మెగాస్టార్ చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే ఉన్న భక్తి గురించి అందరికీ తెలిసిందే. శివ శంకర్‌ వరప్రసాద్‌ గా ఉన్న తన పేరును కూడా ఆంజనేయ స్వామి మీద భక్తితోనే చిరంజీవిగా మార్చుకున్నాడు చిరు. ఈ నేపథ్యంలో ఈ రోజు హనుమజ్జయంతి సందర్భంగా తన చిన్నతనంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. అదే సమయంలో చిరు కోసం బాపు గీసి ఇచ్చిన హనుమంతుని ఫోటోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు చిరు.

`ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది...చిన్నప్పటి నుంచి...1962 లో నాకు  ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా? ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, "ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు  అలానే ఉన్నాయి" అన్నారు. అప్పటి నా ఫోటో.

కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు  నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద తిరిగి చిత్రించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా …? బాపు గారు చెప్పిన మాట "ఏంటోనండి ...బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి ...అలానే ఉంచేసాను ...మార్చలేదు " అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖు (ఏప్రిల్‌ 8) తో కూడా నాకు అనుబంధం ఉంది.` అంటూ సుధీర్ఘ ట్వీట్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి.

Follow Us:
Download App:
  • android
  • ios