సైరా అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఫుల్ యాక్షన్ అండ్ సోషల్ మెస్సేజ్ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని బడ్జెట్ విషయంలో ఏ మాత్రం లిమిట్స్ పెట్టలేదట. నిర్మాత రామ్ చరణ్ - మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి మెగాస్టార్ 152 ప్రాజెక్టుని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం చిత్ర యూనిట్ చాలా బిజీగా ఉంది. ఇప్పటికే మణిశర్మతో కలిసి ఒక ట్యూన్ కూడా రెడీ చేశాడు. చాలా ఎల్లా తరువాత మణిశర్మ మెగాస్టార్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. చివరగా వీరి కాంబినేషన్ లో స్టాలిన్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. మళ్లి 13 ఏళ్ళ తరువాత మెగాస్టార్ సినిమాకు మణిశర్మ ట్యూన్స్ చేస్తున్నాడు.

ఇకపోతే సినిమాలో మెగాస్టార్ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా కనిపిస్తూనే సీక్రెట్ నక్సలైట్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  దర్శకుడు కొరటాల స్క్రీన్ ప్లేలో ఈ సారి చాలా స్ట్రాంగ్ ట్విస్ట్ లో తెరపై ప్రజెంట్ చేయబోతున్నాడట. ఇక రామోజీ ఫిలిం సిటీలో స్ఇప్పటికే కొన్ని స్పెషల్ సెట్స్ ని నిర్మించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం కి సంబందించిన ఒకప్పటి  వాతావరణాన్ని సినిమాలో స్పెషల్ గా ప్రజెంట్ చేయనున్నారట.

ఇక మెగాస్టార్ కోసం స్పెషల్ యాక్షన్ సీన్స్ ఇప్పటికే కొరటాల డిజైన్ చేసుకున్నట్లు టాక్. సైరా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అవ్వాలని మెగాస్టార్ కష్టపడనున్నారు. మరి సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.