మెగా అభిమానులను మెప్పించే విధంగా సైరా సినిమాతో వచ్చిన చిరంజీవి నెక్స్ట్ అదే తరహాలో సక్సెస్ అందుకోవాలని రెడీ అవుతున్నాడు. దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. అయితే ఆ సినిమా ఇటీవల లాంచ్ అయిన సంగతి తెలిసిందే.  

ఇక సినిమాలో నటీనటులను సెలెక్ట్ చేసేపనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాలో త్రిషను హీరోయిన్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మెగా అభిమానులకు ఇది కాస్త షాకింగ్ విషయమనే చెప్పాలి. సైరా సినిమాలో నయనతార తమన్నా లని సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఓ వర్గం నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు ఎవరు పట్టించుకోని త్రిషను సెలెక్ట్ చేసుకోవడంతో కాస్త కంగారుపడుతున్నారు.  త్రిష దాదాపు రిటైర్మెంట్ కి దగ్గరలో ఉంది. కేవలం తనకు తగ్గ పాత్రలను చేసుకుంటూ పర్వలేదనిపిస్తోంది.

కానీ మెగాస్టార్ తో ఇప్పుడు మళ్ళీ జతకట్టడం అంటే ఊహించుకోవడం కష్టంగానే ఉంది. 2006లో స్టాలిన్ లో మెగాస్టార్ తో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇన్నేళ్ల తరువాత మళ్ళీ ఆమెతో నటించడం కరెక్ట్ సెలక్షన్ కాదని కామెంట్స్ వస్తున్నాయి. మరి దర్శకుడు కొరటాల శివ - నిర్మాత రామ్ చరణ్ ఈ విషయంలో ఏదైనా మార్పులు చేస్తారో లేదో చూడాలి.