Asianet News TeluguAsianet News Telugu

చిరు ఏం చెప్పాడయ్యా...ఏ హీరోకు గుచ్చుకుందో!?

కొన్ని విషయాలు కొందరు మాట్లాడతానే పెద్దరికంగా,గౌరవంగా ఉంటాయి. అప్పట్లో ప్రముఖ దర్శక,నిర్మాత,నటుడు,రచయిత అయిన దాసరి నారాయణ రావు గారు స్టేజీ ఎక్కితే ...ఇండస్ట్రీకు అవసరమైన ఎన్నో విషయాలు ప్రస్దావించేవారు. మంచి,చెడులను విశ్లేషించేవారు. ఎవరేమనుకుంటారు అనేది ప్రక్కన పెట్టి నిర్మాత, దర్శకుడు సంక్షేమం కోసం మాట సాయిం చేసారు. హీరో,హీరోయిన్స్ కు చురకలు అంటించేవారు.

Mega Star Chiranjeevi Slams Caravan Culture
Author
Hyderabad, First Published Mar 4, 2020, 8:28 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కొన్ని విషయాలు కొందరు మాట్లాడతానే పెద్దరికంగా,గౌరవంగా ఉంటాయి. అప్పట్లో ప్రముఖ దర్శక,నిర్మాత,నటుడు,రచయిత అయిన దాసరి నారాయణ రావు గారు స్టేజీ ఎక్కితే ...ఇండస్ట్రీకు అవసరమైన ఎన్నో విషయాలు ప్రస్దావించేవారు. మంచి,చెడులను విశ్లేషించేవారు. ఎవరేమనుకుంటారు అనేది ప్రక్కన పెట్టి నిర్మాత, దర్శకుడు సంక్షేమం కోసం మాట సాయిం చేసారు.

హీరో,హీరోయిన్స్ కు చురకలు అంటించేవారు.  ఇఫ్పుడు చిరంజీవి కూడా అలాంటి పనే చేసారు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ లేని విధంగా తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ...నేటి తరం హీరోలకు సూచనలు చేసారు.తన మెగా క్యాంప్ హీరోలకు సైతం గుచ్చుకుంటాయనిపించినా ఆయన చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పి...అంతటా చర్చనీయాంశంగా మారారు. ఇంతకీ చిరు ఏమన్నారంటే...   రాజకీయలకు వెళ్లి .. తాను పదేళ్ల విరామం తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తే ఒకప్పటితో పోలిస్తే పరిస్థితులు చాలా మారిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు చిరు.

రీసెంట్ గా జరిగిన ‘ఓ పిట్ట కథ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. ఈ రోజుల్లో కారవాన్‌లలో కాలక్షేపం చేయడం హీరో హీరోయిన్లకు ఫ్యాషన్ అయిపోయిందన్నారు.  ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్లను కారవాన్‌ల నుంచి పిలవడానికే తన టైమ్ అంతా ఖర్చు పెట్టాల్సి వస్తోందని..  చాలా సమయం, డబ్బు వృథా అవుతోందని.. అలాగే టైమ్ కి షూటింగులకు రాకపోవడం కూడా సమస్యగా మారుతోందని చిరు అన్నాడు.  ఒకప్పుడు హీరో సౌకర్యం కోసం  కారవాన్ ను ఏర్పాటుచేసేవారు. బట్టలు మార్చుకోవడం, టాయిలెట్ లాంటి పనుల కోసం  కారవాన్ ను వాడేవారు. ఇప్పుడు కూడా వాటికే వాడుతున్నారు కానీ అది కాస్తా స్టేటస్ సింబల్ గా మారిపోయింది అన్నారు చిరు. అలాగే హీరో కారవాన్ లోకి దూరితే బయటకు రావడం లేదని, అది నిర్మాణం పై ప్రభావం చూపిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.  

ఒకప్పుడు లాగ లొకేషన్ లోనే హీరోహీరోయిన్లు కుర్చీ వేసుకొని కూర్చుంటే షూటింగ్  పనులు తొందరగా అవుతాయంటున్నారు చిరు. ఇలా చేయడం వల్ల షూటింగ్ డేస్ కనీసం 10 రోజులు ఆదా అవుతుందని, నిర్మాతకు తేలిగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే లొకేషన్ లో కూడా హీరోహీరోయిన్లకు గొడుగులు పట్టేవారు, అవసరమైతే టెంట్ వేసేవారు ఉంటారని చెబుతున్నారు.  

ఇక తాను మాత్రం మేకప్, టాయిలెట్ కోసం మినహా కారవాన్ వాడట్లేదని.. అలాగే ఉదయం 7 గంటలకు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ అంటే తెల్లవారుజామున నాలుగున్నరకే లేచి రెడీ అవుతున్నానని.. ఇలాంటి క్రమశిక్షణ అందరికీ అవసరమని.. షూటింగ్ డేస్ ఎంత తగ్గిస్తే అంత డబ్బులు నిర్మాతకు మిగులుతాయని.. కాబట్టి హీరోలందరూ ఈ దిశగా ఆలోచించాలని చిరు సూచన చేసారు.  అయితే చిరంజీవి చెప్పిన సూచనలు అన్నీ బాగున్నాయి కానీ, తమ మెగా క్యాంప్ కు సంభందించిన హీరోలంతా క్యారవాన్ లు కావాలనేవాళ్లని, వాళ్లంతా మొదట మారాలని, మార్పు ఇంటినుంచే రావాలని మిగతా హీరోల అభిమానులు ఈ స్పీచ్ ని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మంచి చెప్పినా వినేవారు ఎవరు ఈ రోజుల్లో...

Follow Us:
Download App:
  • android
  • ios