మైత్రి మూవీస్ పేరు చెప్పగానే శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి బడా హీరోల చిత్రాలు గుర్తుకు వస్తాయి. కానీ మైత్రి మూవీస్ సంస్థ మాత్రం తాము కేవలం పెద్ద హీరోలతో కమర్షియల్ సినిమాలు మాత్రమే కాక తక్కువ బడ్జెట్ లో ప్రయోగాత్మక చిత్రాలు కూడా రూపొందించనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. 

ఇటీవల మైత్రి మూవీస్ సంస్థ రితేష్ రానా అనే డెబ్యూ దర్శకుడితో తక్కువ బడ్జెట్ లో 'మత్తు వదలరా'అనే చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నూతన నటీనటులు నటిస్తున్నారు. కేవలం కంటెంట్ ని మాత్రమే నమ్ముకుని తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బూస్ట్ అందించేందుకు మైత్రి మూవీస్ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

తాజాగా మైత్రి మూవీస్ సంస్థ మత్తు వదలరా చిత్ర టీజర్ కి సంబంధించిన ఆసక్తికర ప్రకటన చేసింది. రేపు(శనివారం) సాయంత్రం 4:59 గంటలకు మెగా పవర్ స్టార్ రాంచరణ్ మత్తు వదలరా టీజర్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 

రాంచరణ్ చేతుల మీదుగా టీజర్ లాంచ్ కానుండడంతో ఈ చిత్రానికి మంచి బజ్ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు.ఆసక్తికరమైన యూత్ ఫుల్ సబ్జెక్టుతో రితేష్ తన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం విజయం సాధిస్తే మైత్రి మూవీస్ సంస్థ భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాత్మక చిత్రాలు తెరకెక్కించే అవకాశం ఉంది. 

రాంచరణ్, మైత్రి మూవీస్ కాంబినేషన్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రంగస్థలం చిత్రం తెరకెక్కింది. సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ మూవీ టాలీవుడ్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పింది. దీనితో మైత్రి మూవీస్, రాంచరణ్ మధ్య మంచి సాన్నిహిత్యం నెలకొంది.