మెగా యువ హీరోల్లో ప్రతి ఒక్కరు మెగాస్టార్ వేసిన బాటలో హ్యాపీగా నడుచుకుంటూ వెళుతున్నవారే అనే టాక్ నిజమైందే. కానీ ఒక దారి చూపించిన తరువాత ప్రతి సారి యూ టర్న్ లకు మెగా స్టార్ మార్గమవ్వలేరు. ఎవరి దారిలో వారే నడవాలి. ఫైనల్ గా వెండితెరపై ఆడియెన్స్ ని మెప్పిస్తేనే సక్సెస్ లు అందుతాయి. ప్రస్తుతం ఆ దిశగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటున్నాడు మెగా మెనల్లుడు సాయి ధరమ్ తేజ్. 

జయాపజయాలతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తన ఎనర్జీ ద్వారానే ఈ హీరో అవకాశాలు అందుకుంటున్నాడని చెప్పవచ్చు. ఇక నేడు సాయి ధరమ్ తేజ్ 33వ వసంతంలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమా రేయ్ నిరాశపరిచినా.. ఆ తరువాత 'పిల్లా నువ్వు లేని జీవితం - సుప్రీమ్ - సుబ్రహ్మణ్యం ఫర్' సేల్ వంటి సక్సెస్ లతో తనకంటూ ఒక సొంత మార్కెట్ ను సెట్ చేసుకున్నాడు. 

ఇక ఆ తరువాత కొన్నేళ్ల వరకు అపజయాలు ఎదురవ్వడంతో కాస్త సందిగ్ధంలో పడ్డ సాయి ధరమ్ తేజ్.. సాయి తేజ్ గా మారి చిత్ర లహరి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. సక్సెస్ ట్రాక్ ఎక్కినప్పటి నుంచి ఫీల్ గుడ్ మూవీస్ అనే కాన్సెప్ట్ లో ఎక్కువగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అనంతరం సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేయనున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ లో ఆ సినిమా రూపొందుతోంది. అలాగే మరికొన్ని కొత్త కథలను కూడా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టిన సాయి మంచి సినిమాను అభిమానులకు అందించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.