మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తరువాత ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా సైరా సినిమా ప్రమోషన్స్ లో మెగాస్టార్ మొన్నటివరకు బిజీగా కనిపించారు. షూటింగ్ అయిపోగానే డబ్బింగ్ పనుల నుంచి ఎడిటింగ్ వరకు అన్ని దగ్గరుండి చూసుకున్నారు.

అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా ముందుండి వివిధ ప్రాంతాలు తిరిగారు.  ఇకపోతే నేడు ఆయనకు సంబందించిన ఒక స్పెషల్ పిక్ ని సాయి ధరమ్ తేజ్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. మెగాస్టార్ ఒడిలో ఆడుతున్న శ్రీజ రెండో కూతురు వైపు చూస్తున్న సాయి ఆమెతో సరదాగా అల్లరి చేస్తున్నట్లు కనిపిస్తోంది.

.

ఇక  స్మైల్ కోసం ఏదైనా చేయవచ్చని మంచి స్ఫూర్తిని ఇస్తుందని సాయి తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు.   ఇక ప్రస్తుతం ఈ హీరో ప్రతి రోజు పండగే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు మెగాస్టార్ 152వ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేయడానికి సిద్దమవుతున్నాడీ. ఆ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది.