ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం దీపావళి సంబరాల్లో మునిగితేలుతోంది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా ప్రస్తుతం తమ ఫ్యామిలిలో జరిగిన దీపావళి సంబరాలని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఆదివారం రోజు దీపావళి సందర్భంగా మెగాస్టార్ నివాసంలో దీపావళి సంబరాలు జరిగాయి. 

ఈ సంబరాలకు జనసేనాని పవన్ కళ్యాణ్ తమ కుటుంబంతో హాజరయ్యాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మెగా బ్రదర్స్ ముగ్గూరూ కలసి కనిపిస్తూ అభిమానులకు కనుల విందు చేస్తున్నారు. సైరా చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ అందించారు. 

అదేవిధంగా సైరా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవితో వేదిక పంచుకున్నాడు. మెగా బ్రదర్స్ తరచుగా కలుసుకుంటుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా ఉన్నాయి. చిరంజీవి నివాసంలో జరిగిన దీపావళి సెలెబ్రేషన్స్ కు పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా దంపతులు హాజరయ్యారు. 

చిరంజీవి పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ని ముద్దు చేస్తూ ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఈ సంబరాలకు పవన్ పెద్ద కుమారుడు అకిరా నందన్ కూడా హాజరు కావడం విశేషం. 

ఇక సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ త్వరలో వెండితెరపై రీ ఎంట్రీ  ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సైరా ఘనవిజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. మాట్ని ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించనున్నాడు.