కోలీవుడ్ లో ఈ మధ్య మీరా మిథున్ సంబందించిన న్యూస్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె పలు సినిమాల్లో నటించింది. అనంతరం తమిళ్ బిగ్ బాస్ 3 లో మెరిసి అనుకోని కారణాలవల్ల షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆమెకు ఒక అవకాశం మిస్ అవ్వడంతో కోలీవుడ్ పరిశ్రమపై అలాగే కమల్ కూతురిపై అసహనం వ్యక్తం చేశారు.

అదే విధంగా చిత్ర దర్శకుడికి కూడా ఆమె కౌంటర్లు ఇవ్వడం సోషల్ మీడియాలో  వైరల్ అవుతోంది. ముందుగా ఈమెను అగ్ని శిరగుగళ్‌ అనే సినిమాకు సెలెక్ట్ చేసుకున్నారు. అనంతరం కమల్ చిన్న కూతురుకి అక్షర హాసన్ ని అవకాశం ఇవ్వడంతో తమిళ్ లో నేపోటిజమ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చని ఆమె ట్వీట్ ద్వారా వివరణ ఇచ్చారు.

ఈ విషయంలో అందరికి ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. కమల్ హాసన్ అండతో అక్షర హాసన్ కి అవకాశం ఇచ్చారు. అక్షరకు కొంచెం కూడా గిల్టీ లేదా? నవీన్‌ (చిత్రదర్శకుడు), టి. శివమ్మా (నిర్మాత). యొక్క వైఖరి ఎలాంటిదో అర్థమైంది అని ట్వీట్ చేయగా అందుకు దర్శకుడు స్పందిస్తూ.. ముందు షాలిని పాండే ను సినిమా కోసం అనుకున్నాం. మీరా తనంతట తానే సినిమాలో నటిస్తున్నట్లు ప్రచారం చేసుకుంది.

ఇప్పుడు అక్షర హాసన్ ని తీసుకున్నాం అని వివరణ ఇచ్చాడు.  దర్శకుడికి మీరా సమాధానం ఇస్తూ.. జిమ్నాస్ట్‌ కాబట్టి, ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో తనని తీసుకోవాలనుకుంటున్నాం అంటూ మీరు ఇంటర్వ్యూలో చెప్పారు అని ఆమె వీడియో పోస్ట్ చేశారు. ఒక మగాడిగా నిజం మాట్లాడే ధైర్యం ఘాట్స్ లేవా అని మీరా మాట్లాడగా.. దర్శకుడు చివరి సమాధానం అంటూ.. మగడిగా పుట్టినంత మాత్రాన గర్వపడాలని ఏమి లేదు. అలంటి వ్యక్తిని కాదు. మా అమ్మ సోదరిలకు నా కంటే ఎక్కువ ఘట్స్ ఉన్నాయి. బహుశా మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉండవచ్చు డాక్టర్ ని సంప్రదించండి అని కౌంటర్ ఇచ్చారు.  

ఇక అందుకు మీరా ఆగ్రహంతో.. ఒక అమ్మాయిని డాక్టర్ ని కలవమని చెప్పే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. మాటలు జాగ్రత్త అంటూ నా దగ్గర ఉన్న రికార్డింగ్ వీడియో టేప్ ని రిలీజ్ చేస్తే నిపైనే కాకుండా మీ ఇంట్లో వాళ్లపై కూడా అది ప్రభావం చూపుతుందని మీరా ఘాటు సమాధానం ఇచ్చారు.