Asianet News TeluguAsianet News Telugu

మీరా చోప్రా ఇష్యూ: బిగ్ బాస్ సీజన్4 లో అవకాశం...?

తాజాగా మీరా చోప్రా ఇష్యూలో మరో కొత్త గాసిప్ తెరమీదకు వచ్చింది. మీరా చోప్రా ఎన్టీఆర్ ఫాన్స్ పై ఫైర్ అవడంతో ఆమెకు ఒక్కసారిగా ఇతర ఫాన్స్ సపోర్ట్ కూడా దొరికింది. దానికి తోడుగా ఆమె ఏకంగా పవన్ అభిమానులు సౌమ్యంగా ఉంటారు అని కూడా అన్నారు. ఈ వార్ నడుస్తున్నంతసేపు ట్విట్టర్ లో "వి సపోర్ట్ మీరా చోప్రా" అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. 

Meera Chopra Issue: Is She Being Roped In As A Contestant For Bigg Boss 4...?
Author
Hyderabad, First Published Jun 5, 2020, 7:12 AM IST

టాలీవుడ్ లో ఎన్టీఆర్ ఫాన్స్ పై మీరా చోప్రా ఫైర్ అవడం తాజా సెన్సేషన్ గా మారింది. ఆమె ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయం ఇప్పుడు సినీ అభిమానుల్లో హాట్ టాపిక్.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవల సోషల్ మీడియాలో మీరా చోప్రా అభిమానులతో లైవ్ చాట్ లో పాల్గొంది. ఈ సంధర్భంగా ఎన్టీఆర్ గురించి చెప్పండి అని ఓ అభిమాని అడిగాడు. దీనికి మీరా చోప్రా ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదు అని బదులిచ్చింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు హర్ట్ అయిపోయారు.

వాస్తవానికి మీరా చోప్రా తెలుగులో నాలుగైదు చిత్రాలు మాత్రమే చేసింది. ఎన్టీఆర్ తో నటించలేదు. అభిమానులు అడిగినప్పుడు ఎన్టీఆర్ ఎవరో తెలియదు అని చెప్పింది. దీనితో ఎన్టీఆర్ అభిమానులు చాలా అసభ్యంగా మీరా చోప్రా ఒక వేశ్య అని, రాత్రికి నీ రేటెంత అని దూషిస్తూ ట్రోల్ చేసారు.

దీనిపై ఆమె కంప్లైంట్ కూడా ఇచ్చింది. ట్విట్టర్ సంస్థకు కూడా ఈ అకౌంట్లను సస్పెండ్ చేయమని ఫిర్యాదు చేసింది. ఇకపోతే.... ఇలాంటి విషయాల్లో రోజుకో పుకారు బయటకు పుట్టుకు రావడం సహజం. 

తాజాగా మీరా చోప్రా ఇష్యూలో మరో కొత్త గాసిప్ తెరమీదకు వచ్చింది. మీరా చోప్రా ఎన్టీఆర్ ఫాన్స్ పై ఫైర్ అవడంతో ఆమెకు ఒక్కసారిగా ఇతర ఫాన్స్ సపోర్ట్ కూడా దొరికింది. దానికి తోడుగా ఆమె ఏకంగా పవన్ అభిమానులు సౌమ్యంగా ఉంటారు అని కూడా అన్నారు. ఈ వార్ నడుస్తున్నంతసేపు ట్విట్టర్ లో "వి సపోర్ట్ మీరా చోప్రా" అనే హ్యాష్ టాగ్ కూడా ట్రెండ్ అయింది. 

ఈ మొత్తం వివాదం విషయాన్నీ పరిగణలోకి తీసుకున్న బిగ్ బాస్ యాజమాన్యం.... మీరా చోప్రాను బిగ్ బాస్ 4 లో భాగస్వామిని చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ లో కావలిసింది పాపులారిటీ, కాంట్రవర్సీ. ఈ వివాదం వల్ల ఇంతవరకు మీరా చోప్రాను దాదాపుగా మరిచిపోయిన తెలుగు ప్రజలకు ఆమె మరోసారి వార్తల్లోని వ్యక్తిగా నిలిచారు. 

ఆమె పేరు ఇప్పుడు దాదాపుగా అందరి నోర్లలోనూ కొన్ని రోజులుగా నానుతుండడం, ఫాన్స్ ట్వీట్ సంగ్రామం వల్ల దక్కిన కాంట్రవర్సీ, పాపులారిటీ అన్ని వెరసి ఆమెకు ఇప్పుడు బిగ్ బాస్ అవకాశం తలుపు తట్టేలా ఉంది. 

కాకపోతే ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. ఈ నాలుగవ సీజన్ బిగ్ బాస్ లో యాజమాన్యం జూనియర్ ఎన్టీఆర్ ను హోస్ట్ గా తిరిగి తీసుకురావాలని యోచిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన మూడు బిగ్ బాస్ సీజన్లలోనూ తారక్ హోస్ట్ చేసిన సీజన్ వన్ అభిమానులను ఎక్కువగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

కరోనా లాక్ డౌన్ సమయంలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సీజన్3 ని రీటెలికాస్ట్ చేస్తే ఏకంగా అభిమానులు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన సీజన్ వన్ నే ప్రసారం చేయమని కోరారు. 

ఎన్టీఆర్ ని హోస్ట్ గా తీసుకురావాలంటే మీరా చోప్రాను బిగ్ బాస్ షో లో పార్టిసిపంట్ గా చేర్చడం కష్టం. ఈ పరిస్థితుల నేపథ్యంలో వేచి చూడాలి. ఇది పుకారుగానే మిగిలిపివుతుందా, లేదా ఈ వివాదం సద్దుమణిగి బిగ్ బాస్ హోస్ట్ గా ఎన్టీఆర్, పార్టిసిపంట్ గా మీరా చోప్రా వస్తారేమో....!

Follow Us:
Download App:
  • android
  • ios