విజయ్ దేవరకొండ నిర్మాతగా యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన చిత్రం ' మీకు మాత్రమే చెప్తా'. ఫైనల్ ఈ కామెడీ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి నుంచి సినిమాపై పాజిటివ్ బజ్ నెలకొంది. పైగా విజయ్ ప్రమోషన్స్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేశాడు.ఇప్పటికే పలువురు సినీ తారలు సినిమా స్పెషల్ షోను చూసేశారు.  అలాగే యూఎస్ లో ప్రీమియర్స్ కూడా పూర్తయ్యాయి.

సినిమా విషయానికి వస్తే.. మెయిన్ గా దర్శకుడు తరుణ్ భాస్కర్ తన నటనతో మంచి కామెడీని పండించాడనే చెప్పాలి. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ఆహ్లదకరకంగా తెరకెక్కించాడు. మేకింగ్ లో రియాలిటీతో పాటు అతని స్టైల్ చక్కగా కనిపిస్తోంది. ఎక్కడా తగ్గకుండా ఒక ఫ్లోలో సినిమా కథను నడిపించాడు. ట్రైలర్ లోనే దాదాపు సినిమా కాన్సెప్ట్ ని చెప్పేశారు.

మొబైల్ కి సంబందించిన పాట్లు మాములుగా లేవు. చివరలో పెళ్లి సీన్స్ తో పాటు అనసూయకు పాత్రకు సంబందించిన ట్విస్ట్ ని బాగా ప్రజెంట్ చేశారు. ఇక ఆమె  పాత్ర సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇక అభినవ్ మరోసారి తన హావభావాలతో ఆడియెన్స్ కి మంచి కిక్ ఇవ్వడం పక్కా. నటీనటుల కామెడీ టైమింగ్ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎనర్జీతో కనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొన్ని సీన్స్ అంతగా వర్కౌట్ కాలేవని చెప్పవచ్చు.

ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో బాగా క్లిక్కయింది.  ట్విస్ట్ లు టర్నింగ్ పాయింట్స్ ఇలా అన్ని అంశాలను దర్శకుడు శమ్మిర్ సుల్తాన్ సమపాళ్లలో ప్రజెంట్ చేశాడు. విజయ్ నిర్మాతగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. రియాలిటీ మిస్సవ్వకుండా డ్రామా ఫీల్ కూడా పోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా సినిమా యూత్ కి ఎక్కువగా నచ్చే అవకాశం ఉంది. మరి ప్రవాసులని మెప్పించిన మీకు మాత్రమే చెప్తా లోకల్ బాయ్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.