పెళ్లిచూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్‌ను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోను చేస్తున్న సంగతి తెలిసిందే. రిటర్న్ గిప్ట్ గా ఇండస్ట్రీ చెప్పుకుంటున్న ఈ సినిమా‘మీకు మాత్రమే చెప్తా’టైటిల్ తో రిలీజ్ అవుతోంది. ఆ మధ్యన రిలీజైన ఈ చిత్రం టీజర్ ఇప్పటికే కుర్రాళ్లకు ఎక్కేసింది. దాంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయ్ దేవరకొండను ట్యాగ్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం  గురించిన ఓ వార్త లీక్ అయ్యింది. అదేమిటంటే...ఈ సినిమా కథ పూర్తిగా రెండు రాత్రులు, మూడు రోజుల్లో జరుగుతుందిట.

పూర్తి కామెడీ ఎంటర్టైన్మెంట్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని ఊహించని ట్విస్ట్ లు, టర్న్ లు ఉన్నాయట. వాటితో సినిమా ఆద్యంతం ఇంట్రస్టింగ్ గా  ఉంటుందిట. అంతేకాదు చివర్లో చిన్న సందేసం కూడా ఉంటుందిట. చిన్న పాయింట్ చుట్టూ అల్లుకున్న మంచి ఎంటర్‌టైనర్‌ అని చెప్తోంది యూనిట్.

ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి చిత్రాన్ని  మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 1న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. అప్పటికి విజయ్ దేవరకొండ తాజా చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ సైతం పూర్తి కానుంది. ఈ రిలీజ్ డేట్ ని కలిపి ట్రైలర్ ని సైతం వదలటానికి సన్నాహాలు చేస్తున్నారు.

 కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నిర్మిస్తోన్న చిత్రం ‘‘మీకు మాత్రమే చెప్తా’’. ఎవ్రీ ఫోన్ హ్యాజ్ ఇట్స్ సీక్రెట్స్ అనేది ట్యాగ్ లైన్.    తరుణ్ భాస్కర్‌తో పాటు అనసూయ భరద్వాజ్ మరో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటం విశేషం.‘మీకు మాత్రమే చెప్తా’లో తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, అనసూయ భరద్వాజ్ లీడ్ రోల్స్‌లో నటిస్తుంటే.. పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్, అవంతిక మిశ్రా, వినయ్ వర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.