మే 1న నిర్వహించే కార్మికుల దినోత్సవ (May Day) వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహించనన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ యూనియన్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ వేడుకలకు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తెలుగు చలన చిత్ర రంగంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అటు సినిమాల్లో నటిస్తూనే ఇటు సినీ ఇండస్ట్రీలో తలెత్తుతున్న సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇటీవల ఏపీలో టికెట్ల రేట్లు పెంపు, బెనిఫిట్ షోస్, చిన్న సినిమా నిర్మాణ సంస్థల మనుగడ కోసం తన వంతు ప్రయత్నం చేశారు. సినీ కార్మికులు ఎక్కువగా చిన్న సినిమాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. పెద్ద సినిమాలు ఏడాదికి నాలుగైదు ఉంటే.. చిన్న సినిమాలో పదు సంఖ్యలో నిర్మాణం జరుపుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో కార్మికుల జీవితాలను ద్రుష్టిలో ఉంచుకొని ఏపీ ప్రభుత్వాన్ని ప్రత్యేక కలిశారు. టాలీవుడ్ లోని 24 క్రాఫ్ట్స్ ను బతికించేందుకు జగన్ ప్రభుత్వం సహకరించాలని కోరారు. అలాగే కరోనా సమయంలోనూ తనవంతు సహకారంగా సినీ కార్మికులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు సహాయ సహకారం అందించారు. 

అయితే, యేటా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ (TFI) ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్వర్యంలో మేడే ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సారి భారీ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు యూనియన్ నేతలు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటి నుంచే చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్వర్యంలో మేడే ఉత్సవాలు కొనసాగనున్నట్టు యూనియన్ నాయకులు తెలుపుతున్నారు. May 1న హైదరాబాద్ లో సినీ ఇండస్ట్రీ లోని అన్ని విభాగాలు ((24 క్లాప్స్ ) తో కలిసి నిర్వహిస్తున్న మేడే ఉత్సవాల్లో చిరంజీవితో పాటు, పలువురు సినీ పెద్దలు కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది. దాదాపు పది వేలమంది తో భారీస్థాయి లో మేడే సెలబ్రేషన్స్ (MayDay Celebrations 2022) నిర్వహించనుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్. మరిన్ని వివరాలు మున్ముందు తెలియజేయనున్నారు.