కీరవాణి కుమారులు శ్రీసింహా హీరోగా, కాలభైరవ మ్యూజిక్ దర్శకుడిగా పరిచయం అయిన చిత్రం ‘ మత్తు వదలరా’. ఒక సింపుల్ కాన్సెప్ట్ ని తీసుకొని ఆడియన్స్ ని ఆకట్టుకోవటంలో ‘మత్తు వదలరా’ టీమ్ సక్సెస్ అయ్యింది. బుధవారం రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అమెరికాలో అనుకున్న స్దాయిలో వర్కవుట్ కావటం లేదు. అక్కడ కూడా మంచి క్రేజ్ ఈ సినిమాకు వచ్చినప్పటికీ అక్కడి డిస్ట్రిబ్యూటర్ పూర్ ప్లానింగ్ వలన దెబ్బకొట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

డిస్ట్రిబ్యూటర్ కు ఫ్రీగా రిలీజ్  ఇచ్చారు. అయితే అక్కడ ఎక్కువ థియోటర్స్ లో రిలీజ్ చెయ్యలేకపోయారు. అదే సమయంలో పబ్లిసిటీ విషయంలోనూ ఫెయిలయ్యారు. తమ సొంత డబ్బు పైసా కూడా తీయకుండా కేవలం ప్రొడ్యూసర్స్ మీదే ఆధారపడ్డారు. దాంతో అక్కడ చాలా మందికి రీచ్ కాలేదు. రివ్యూలతో మంచి టాక్ వచ్చినా, కొన్ని లొకేషన్స్ పెంచినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.

ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో  వీకెండ్‌కి చేరే సరికి భారీ సంఖ్యలో ఈ సినిమాకు స్క్రీన్లు పెరిగాయి. అన్ని చోట్లా దాదాపు  హౌస్‌ఫుల్స్‌తో రన్‌ అవుతోంది. అతి తక్కువ బడ్జెట్‌తో, కొత్త నటీనటులతో రూపొందిన ఈ చిత్రం ఈ స్దాయి విజయం సాధించటం అందరనీ ఆశ్చర్యపరుస్తోంది.  ఈ సంవత్సరం మధ్యలో వచ్చిన బ్రోచేవారెవరురా, ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ మాదిరిగా ఇది కూడా సర్‌ప్రైజ్‌ హిట్‌గా నిలిచిందని ట్రేడ్ అంటోంది.  

రితేష్ రాణా ‘మత్తు వదల’రాకు దర్శకత్వం వహించాడు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ హీరోగా.. పెద్ద కుమారుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. జీవా, విద్యుల్లేఖ రామన్, సత్య, నగరేష్ అగస్త్య, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.