సినిమా ఇండస్ట్రీలో ఒక ప్లాప్ వస్తే.. నెక్స్ట్ సినిమా చేయడానికి స్టార్ హీరోలు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా అడుగులు వేస్తుంటారు. కానీ రవితేజ మాత్రం రివర్స్ గేర్ లో పయనిస్తున్నాడు. ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రాజా ది గ్రేట్ అనంతరం రవితేజ వరుసగా నాలుగు సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు.

టచ్ చేసి చూడు - నెల టిక్కెట్టు - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు ఊహించని విధంగా దెబ్బ కొట్టాయి. ఇక ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన డిస్కో రాజా కూడా ప్లాప్ లిస్ట్ లో చేరిపోయింది. అయినప్పటికీ మాస్ రాజా ఏ మాత్రం స్పీడ్ తగ్గించలేదు. వచ్చిన అవకాశాలని మిస్ చేసుకోకుండా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక్క సినిమా హిట్టయినా చాలని రివర్స్ లో ఆలోచిస్తున్నాడు.  ఈ ఏడాది మాస్ రాజా మరో రెండు సినిమాలని విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నాడు.

నెక్స్ట్ రవితేజ కిక్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. బలుపు దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఆ సినిమా మే 8న రిలిజ్ కానుంది. ఆ తరువాత రమేష్ వర్మ తో కూడా వెంటనే మరో సినిమాని స్టార్ట్ చేయనున్నాడు. ఇదే ఏడాది చివరిలో రమేష్ ప్రాజెక్ట్ ని రిలీజ్ చేయాలనీ రవితేజ టార్గెట్ గా పెట్టుకున్నాడు. మరీ ఈ రెండు సినిమాలు మాస్ రాజాకి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.