మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం డిస్కోరాజా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రవితేజ ఈ సినిమా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. సినిమాలో ఒక పాత్ర కోసం బాడీ కూడా పెంచాడు.

అప్పట్లో వర్కౌట్స్ చేసిన ఒక పిక్ బాగా వైరల్ అయ్యింది.  ఈ సినిమా హిట్టవ్వడం మాస్ రాజాకి చాల అవసరం. రాజా ది గ్రేట్ అనంతరం అయన వరుసగా డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సారి సక్సెస్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. ఇటీవల చిత్ర యూనిట్ తో రవితేజ సీరియస్ డిస్కర్షన్స్ చేసినట్లు కూడా తెలుస్తోంది.

ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించవద్దని తన కెరీర్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని సినిమా యూనిట్ కి వివరించినట్లు సమాచారం. అందుకే డిస్కో రాజా ప్రమోషన్ కి స్పెషల్ ప్లాన్స్ జరుగుతున్నట్లు సమాచారం.  సినిమా రిలీజ్ కి సమయం దగ్గరపడుతుండటంతో ప్రమోషన్ డోస్ పెంచేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ముందుగా థమన్ కంపోజ్ చేసిన ఒక డిఫరెంట్ సర్‌ప్రైజ్‌ ట్యూన్ తో సినిమాపై అంచనాలు పెంచాలని డిసైడ్ అయ్యారు.

రెట్రో వైబ్స్ లో 'నువ్వు నాతో ఏమన్నావో' అనే ఒక సాంగ్ ని థమన్ రెడీ చేసి ఉంచాడు. అక్టోబర్ 19న సాయంత్రం 7గంటలకు ఆ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. 11 ఏళ్ల వయసులో జాజ్ డ్రమ్స్ వాయించేటప్పుడు తనతో అప్పుడు వర్క్ చేసిన సీనియర్ మ్యూజిషియన్స్ ని ఈ సినిమాలో సాంగ్ కోసం పని చేయిస్తున్నట్లు గత నెల థమన్ సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చాడు.

మరి ఆ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. విఐ.ఆనంద్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.