మాస్ ట్రీట్ ఇవ్వబోతున్న విశ్వక్ సేన్, కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చిన యంగ్ హీరో..
వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. తాజాగా మరోసినిమాను సెట్స్ ఎక్కిస్తున్నాడు. ఈసినిమాకు సంబంధించిన సాలిడ్ అప్ డేట్ ను ఫ్యాన్స్ కోసం రిలీజ్ చేయబోతున్నాడు మాస్ హీరో.

మాస్ క్లాస్ తో పాటు..యూత్ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకన్నాడు యంగ్ అండ్ డైనమిక్ హీరో విష్వక్సేన్. ఈమధ్య ఎక్కువగా కాంట్రవర్సిలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న ఈ యంగ్ స్టార్... దాస్ కా దమ్కీ మూవీతో పర్వలేదు అనిపించాడు. ఈసినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మధ్య కాలంలో గెలుపోటములు సమానంగా ఫేస్ చేస్తూ వస్తున్న విశ్వక్ సేన్.. తాజాగా మరో సినిమాను సెట్స్ ఎక్కించాడు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 11వ సినిమా.
ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఫిక్స్ చేయలేదు టీమ్. త్వరలో టైటిల్ ఖరారు చేయలేదు. ఈ నెల 31వ తేదీన ఉదయం 10:19 నిమిషాలకు టైటిల్ ను ఎనౌన్స్ చేయనున్నట్టు చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు. అదే సమయంలో ఫస్టు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఈ పోస్టర్ పై చెవి పోగుతో .. పూల చొక్కాతో .. దమ్ముకొడుతూ మాస్ లుక్ తో విష్వక్ కనిపిస్తున్నాడు.
ఇంత వరకూ విశ్వక్ సేన్ మాస్ యాక్టింగ్ చూపించాడు కాని..మాస్ లుక్ లో మాత్రం కనిపించలేదు. ఈసారిమాస్ యాక్టింగ్ తో పాటు..మాస్ లుక్ లో జీవించబోతున్నట్టు తెలుస్తోంది. సితార నాగవంశీ - సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమాకి, కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా తో మాస్ కా దాస్ హిట్ కొడతాడా లేదా చూడాలి మరి.