చిన్న పాయింట్ తో రెండున్నర గంటలు స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయగల దర్శకుడు మారుతి. మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలతో హిట్స్ అందుకున్న మారుతి ప్రస్తుతం 'ప్రతి రోజు పండగే' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా నటిస్తున్న ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇకపోతే రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు.

2017లో శర్వానంద్ తో తీసిన మహానుభావుడు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాను మారుతి హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ఈ విషయంపై ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన మారుతి హిందీ రైట్స్ తన దగ్గరే ఉంచుకున్నట్లు చెప్పాడు. శర్వానంద్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచిన ఆ కథ రైట్స్ కోసం బాలీవుడ్ సినీ ప్రముఖులు గట్టుగానే ప్రయత్నించారు.

కానీ మారుతి తొందరపడకుండా సొంతంగా తానే హిందీలో డైరెక్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి బాలీవుడ్ మహనుబావుడిగా ఎవరు కనిపిస్తారో చూడాలి. ఇక ప్రతిరోజు పండగే చిత్రీకరణ దాదాపు ఎండింగ్ కి వచ్చేసింది. కొన్ని కీలక సన్నివేశాల అనంతరం షూటింగ్ కి ఎండ్ కార్డ్ పెట్టనున్నారు. మొదటిసారి మారుతి సాయి ధరమ్ తేజ్ కాంబోలో సినిమా వస్తుండడంతో ఓ వర్గం ప్రేక్షకులను సినిమా ఎట్రాక్ట్ చేస్తోంది. మరి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.