సోషల్ మీడియా వచ్చాక సెలబ్రెటీలు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చేసాయి. దాంతో కొంతమంది వారిని వెటకారం చెయ్యటం, ట్రోలింగ్ చెయ్యటం కామన్ అయ్యిపోయింది. ముఖ్యంగా ఫ్యాన్స్, యాంటి ఫ్యాన్స్ గా సోషల్ మీడియా విడిపోయాక ఇది మరీ ఎక్కువైంది. తాజాగా డైరక్టర్ మారుతి పెట్టిన ఓ పోస్ట్ కు ఓ నెట్ జన్ వెటకారం చేసాడు. దానికి మారుతి వెంటనే రిప్లై ఇచ్చి నోరు మూయించే ప్రయత్నం చేసారు.

బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్నకోలీవుడ్ హీరోస్.. 200కోట్లకు పైనే

అదెలా జరిగిందంటే..రీసెంట్ గా  పవన్ కళ్యాణ్ వన రక్షణ క్యాంపైన్ స్టార్ట్ చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఆ ఫొటోల్లో పవన్ చాలా హుషారుగా కనిపించారు. అది చూసిన ఆయన అభిమానులు పవన్ సంతోషంగా ఉంటే మనకి ప్రతిరోజూ పండగే అంటూ సాయి తేజ్, మారుతిల కొత్త చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ టైటిల్ తో  ఒక ఫోటో ఎడిట్ చేసి వదిలారు. ఆ పోస్టర్  చూసిన మారుతి  చాలా బాగుంది, నాకు నచ్చింది అంటూ ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్  చూసిన నెటిజన్ ఒకరు అత్యుత్సాహంతో పవన్ అభిమానుల్ని బాగా వాడుకుంటున్నావ్, మీరు సూపర్ ప్లాన్ వేశారు అంటూ కామెంట్ చేశారు. అది చూసి మండుకొచ్చిన మారుతి ఏదైనా నచ్చిన పోస్ట్ పెడితే ఎటకారం ఎక్కువైపోయింది ఒక్కోడికి అంటూ ఫైర్ అయ్యారు. మారుతి రిప్లై  చూసిన నెటిజన్స్, మారుతి ఫాలోవర్స్ బాగా సమాధానం ఇచ్చారు అంటూ మారుతికి సపోర్ట్ చేసారు.