అంబులెన్స్ సమయానికి రాకపోవడంతో ప్రసవానంతరం ప్రముఖ మరాఠీ నటి మరణించిన ఘటన మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో చోటుచేసుకుంది. ముంబై నగరానికి 590 కిలోమీటర్ల దూరంలోని మరాట్వాడలోని హింగోలి జిల్లాకి చెందిన పూజా జుంజార్ (25) మరాఠీచిత్రాల్లో నటించింది.

గర్భం దాల్చిన పూజా పురిటినొప్పులతో ఉండగా.. ప్రసవం కోసం ఆమెని తెల్లవారుజామున రెండు గంటలకు గోరేగాంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. పూజా ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పుట్టిన కాసేపటికే బిడ్డ మరణించింది. పూజా పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆమెని హింగోలీలోని గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించాలని ప్రాథమిక వైద్యకేంద్రం వైద్యులు సూచించారు.

చరణ్ vs తారక్.. RRR స్టార్స్ టోటల్ బాక్స్ ఆఫీస్ ట్రాక్

గోరేగాం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటల్ కి తరలించడానికి సమయానికి అంబులెన్స్ దొరకలేదు. పూజా కుటుంబసభ్యులు ఆలస్యంగానైనా ఓ ప్రైవేట్ అంబులెన్స్తీసుకొచ్చి అందులో ఆమెని హింగోలీ తీసుకువెళ్తుండగా.. మార్గమద్యంలోనే పూజా మరణించింది.

సమయానికి వైద్యం అందకపోవడం వలనే ఆమె మరణించడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.  రెండు మరాఠీ సినిమాల్లో నటించిన ఆమె గర్భం దాల్చడంతో సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకుంది. ప్రసవంలో పూజాతో పాటు బిడ్డ కూడా మరణించడం విషాదాన్ని నింపింది.