తమిళ స్టార్ కమెడియన్ వడివేలు మరోసారి వార్తల్లో నిలిచారు. వడివేలు ఎన్నో చిత్రాల్లో తన హాస్యంతో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. వడివేలు గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. 

వడివేలు, మరో సీనియర్ కమెడియన్, రచయిత అయిన మనోబాల మధ్య వివాదం మొదలయింది. ఇటీవల ఓ వీడియోలో మనోబాల, సింగముత్తు ఇద్దరూ వడివేలుని విమరిస్తూ కామెంట్స్ చేశారు. దీనితో వడివేలు తనని కించపరిచారు అంటూ నడిగర్ సంఘంలో ఫిర్యాదు చేశారు. 

వడివేలు ఫిర్యాదుపై మనోబాల స్పందించారు. వడివేలుతో తనది 30 ఏళ్ల స్నేహం అని పేర్కొన్నారు. తనకు వడివేలుని కించపరిచే ఉద్దేశం లేదని అన్నారు. ఆయన స్నేహాన్ని వదులుకోలేను. ప్రస్తుతం వడివేలు కోపంతో ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత అన్ని వివరంగా ఆయనకు చెబుతా అని మనోబాల తెలిపారు.