టాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ కింగ్ నాగార్జున పై ఎప్పుడు లేని విధంగా కొత్త సినిమా స్టార్ట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. గతంలో నాగార్జున ఎన్నో అపజయాలని చూశాడు. కానీ వాటిని పెద్దగా పట్టించుకోకుండా కొత్త సినిమాలను వెంటనే స్టార్ట్ చేసేవారు. అయితే మన్మథుడు 2 ఎఫెక్ట్ ఈ సారి గట్టి దెబ్బె కొట్టినట్లు అర్ధమవుతోంది.

 నాగ్ మరో కథను మొదలుపెట్టడానికి ఇంకా సిద్దమవ్వలేదు. నెక్స్ట్ నాగార్జున బంగార్రాజు సినిమాలో నటించనున్నట్లు గత కొన్ని వారాలుగా కథనాలు వెలువడుతున్నాయి. సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్  గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలోనే పాత్రతోనే ఆ సీక్వెల్ చేయాలనీ నాగ్ అదే దర్శకుడితో గత ఏడాది నుంచి చర్చలు జరుపుతున్నాడు.

read also: తెలుగు కమెడియన్స్ రెమ్యునరేషన్స్.. రోజుకి ఎంతంటే?

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ రెడీ చేసినప్పటికీ చాలా సార్లు నాగ్ అందులో మార్పులు చేయించాడు. మొత్తానికి సినిమాని నవంబర్ లోనే మొదలుపెట్టాలని అనుకున్నారు. కానీ సినిమాకు సంబందించిన  ఫైనల్ స్క్రిప్ట్ పై నాగ్ మరిన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నాడట. మన్మథుడు డిజాస్టర్ అవ్వడంతో నెక్స్ట్ చేయబోయే సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలవాలని ప్రతి సీన్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

క్లయిమాక్స్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎవరు ఉహించని విధంగా ఉండాలని దర్శకుడితో నాగ్ మరోసారి చర్చించారట. దీంతో మరోసారి స్క్రిప్ట్ ని రీ డిజైన్ చేయాలనీ నిర్ణయించుకున్న కళ్యాణ్ డిసెంబర్ లో నాగ్ ని ఒప్పించి సినిమాని సెట్స్ పైకి రప్పించాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి నాగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.