Asianet News TeluguAsianet News Telugu

కథానాయికగా సింగర్ మంగ్లీ.. మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

యాంకర్ గా హోస్ట్ పలు ప్రోగ్రాములతో క్లిక్కయిన మంగ్లీ (సరస్వతి) సిల్వర్ స్క్రీన్ పై కథానాయికగా కనిపించనుంది. సింగర్ గా బిజీ అవుతున్న తరుణంలో మంగ్లీ నటిగా కూడా మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇక ఆమె మొదటి సారి టైటిల్ రోల్ లో నటించిన సందేశాత్మక చిత్రం 'స్వేచ్ఛ' రిలీజ్ కి సిద్ధమైంది.

mangli new movie swccha release date
Author
Hyderabad, First Published Feb 15, 2020, 6:15 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

యాంకర్ గా హోస్ట్ పలు ప్రోగ్రాములతో క్లిక్కయిన మంగ్లీ (సరస్వతి) సిల్వర్ స్క్రీన్ పై కథానాయికగా కనిపించనుంది. సింగర్ గా బిజీ అవుతున్న తరుణంలో మంగ్లీ నటిగా కూడా మంచి ఆఫర్స్ అందుకుంటోంది. ఇక ఆమె మొదటి సారి టైటిల్ రోల్ లో నటించిన సందేశాత్మక చిత్రం 'స్వేచ్ఛ' రిలీజ్ కి సిద్ధమైంది.

ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ సందర్బంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడింది. కెపీఎన్‌. చౌహన్‌ దర్శకత్వంలో సరస్వతి డెవలపర్స్‌, లచ్చురాం ప్రొడక్షన్స్‌ పతాకంపై ఆంగోత్‌ రాజునాయక్‌ దీన్ని నిర్మించారు. స్వేచ్ఛ సినిమా నిర్మాత మాట్లాడుతూ.. తండా స్థాయి నుండి ప్రపంచస్థాయి వరకు గాయనిగా ఎదిగిన మంగ్లీ ఈ చిత్రంలో అద్భుతమైన పాత్రను పోషించింది.

ఆమె పాత్ర నేటి అమ్మాయికు ఎంతో ప్రేరణగా నిుస్తుంది. సెంటిమెంట్‌, వినోదం మేళవింపుతో రూపొందిన ఈ చిత్రం అందర్ని అరిస్తుందనే నమ్మకం వుంది. పాపికొండతో పాటు పు అందమైన లోకేషన్లలో చిత్రీకరణ చేశాం’ అని తెలిపారు. ‘ఒక మంచి పాత్రలో నటించడంతో పాటు సంగీతం అందించడం ఆనందంగా ఉందని’ భోలో షావలి తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడపిల్ల అంతే ముఖ్యమని తెలిపే చిత్రమిది. ఆడప్లిను పురిటిలోనే చంపకుండా వారిని చదివించి, ప్రయోజకు చేస్తే ఏ రంగంలో వాళ్లు తీసిపోరనే అద్భుతమైన కథాంశమిది. మంగ్లీ నటన ఈ చిత్రానికి హైలైట్‌గా నిుస్తుంది. హాస్య నటుడు చమ్మక్‌ చంద్ర ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటించాడని తెలిపారు. ‘బంజారే బంజారే..’ పాటను సింగర్‌ మంగ్లీ అద్భుతంగా ఆపించినట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios