Asianet News TeluguAsianet News Telugu

సినీ నటి, మాండ్యా ఎంపీ సుమలతకు కరోనా

గత తరం నటి, మాండ్య ఎంపీ సుమలత కు కరోనా సోకింది. ఆమెకు కరోనా వైరస్ సోకడంతో ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆమెకు కరోనా సోకడంతో ఆమె ఇంట్లోని మిగితావారికి కూడా కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. 

Mandya MP Sumalatha Ambareesh Tests Positive For Coronavirus
Author
Mandya, First Published Jul 6, 2020, 7:15 PM IST

గత తరం నటి, మాండ్య ఎంపీ సుమలత కు కరోనా సోకింది. ఆమెకు కరోనా వైరస్ సోకడంతో ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఆమెకు కరోనా సోకడంతో ఆమె ఇంట్లోని మిగితావారికి కూడా కరోనా పరీక్షలను నిర్వహించనున్నారు. 

ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని హోమ్ క్వారంటైన్ లో రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్పినట్టు తెలియవస్తుంది. ఆమెకు కరోనా సోకిందని తెలియగానే ఆమె త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ప్రార్థిస్తున్నారు. 

ఇకపోతే... కరోనా మహమ్మారి రోజు రోజుకీ వికృత రూపం దాలుస్తోంది. భారత్ లో ఈ వైరస్  ప్రభావం పెరిగిపోతోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త  కోవిడ్ కేసులు నమోదౌతున్నాయి.  ఇక తాజాగా నమోదైన కేసులతో భారత్ రష్యాను అధిగమించి అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మూడో స్థానానికి చేరింది. 

రష్యాలో ఇప్పటివరకు 6,81,251 కరోనా కేసులు నమోదుకాగా.. భారత్‌లో 6,95,396 కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికా, బ్రెజిల్ తరువాతి స్థానంలో ఇప్పుడు భారతదేశం నిలిచింది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ విషయంలో భారత్ మూడో స్థానానికి చేరుకుంది.

మరోపక్క రష్యా వ్యాప్తంగా కరోనా బారిన పడి 10,161 మంది మరణించగా.. భారత్‌లో ఇప్పటివరకు 19,692 మంది మృత్యువాతపడ్డారు. భారత్‌లో నిత్యం 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దాదాపు 25 వేల కరోనా కేసులు నమోదైనట్టు.. 613 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. 

భారత్‌లో నిత్యం కరోనా కేసుల సంఖ్య పెరగడమే కాని ఎక్కడా తగ్గుముఖం కనిపించడం లేదు. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు కరోనాకు కేంద్రాలుగా  మారిపోయాయి. మహారాష్ట్రలో తాజాగా 7 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. తమిళనాడులో 4,200కు పైగా, ఢిల్లీలో 2,500కు పైగా కేసులు నమోదయ్యాయి. 

ప్రపంచదేశాల మాదిరిగానే భారత్ మార్చి నెలాఖరు నుంచి పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించింది. ప్రపంచదేశాల కంటే భారత్‌ లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేయగలిగింది. అయితే లాక్‌డౌన్‌లో సడలింపులు ఇవ్వడంతో దేశంలో కేసులు పెరుగుతూ పోతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్తోనూ వైరస్ ప్రభావం బాగా పెరుగుతోంది. తెలంగాణలో 23వేల కేసు నమోదు కాగా... ఆంధ్రప్రదేశ్ లో కేసులు 20వేలకు చేరువలో ఉండటం గమనార్హం.

Follow Us:
Download App:
  • android
  • ios