ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా అంతా ఇంటికే పరిమితమయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టడంతో ఎవరు గడప దాటలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో నిత్యవసరాలు దొరకటమే గగనం మారటంతో  ఇక సెలూన్‌,   బ్యూటీ పార్లర్ లాంటి ఎక్కడ అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రతీ ఒక్కరు బార్బర్‌లుగా మారిపోతున్నారు. ఇప్పటికే సచ్చిన్‌ లాంటి వారు స్వయంగా తమకు తాము కటింగ్ చేసుకొని ఈ వీడియోను షేర్‌ చేయగా తాజాగా మంచు ఫ్యామిలీ కూడా ఈ లిస్ట్‌లోకి చేరిపోయింది.

మంచు వారి కోడలు, విష్ణు భార్య విరానిక కొడుకు అవ్రమ్‌కు కటింగ్ చేసింది. లాక్‌ డౌన్‌కు ముందు విదేశాలకు వెళ్లిన విరానిక సడన్‌గా లాక్‌ డౌన్‌ ప్రకటించటంతో అక్కడే చిక్కుకుపోయింది. అక్కడ కూడా నిర్భందాలు ఉండటంతో ఇంట్లోనే ఉంటున్న విరానిక తన కొడుకు స్వయంగా కటింగ్ చేసి ఈ వీడియోనే మంచు అభిమానులతో షేర్ చేసుకుంది. `వీడియోతో పాటు ఫస్ట్‌ టైం అవ్రమ్‌ హెయిర్‌ కట్‌ చేశా` కామెంట్ చేసింది. ఈ వీడియోపై మంచు లక్ష్మీ, హీరోయిన్‌ హన్సికలు స్పందించారు.

ఇటీవల మాస్క్‌ తయారి విషయంలో కూడా ఓ వీడియోను రూపొందించింది విరానిక. హ్యాండ్‌ కర్చీఫ్‌ను మాస్క్‌గా ఉపయోగించటం ఎలాగో చేసి చూపించింది. అంతేకాదు సెలబ్రిటీలు విసురుతున్న చాలెంజ్‌లో నేను సైతం అంటూ భాగస్వామి అవుతోంది విరానిక.