మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ప్రస్తుతం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. మంచు విష్ణు ఈ ఏడాది వరుస చిత్రాల్లో నటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. విష్ణుకి హిట్ దక్కి చాలాకాలమే అవుతోంది. దీనితో త్వరగా మంచి హిట్ అందుకోవాలనే పట్టుదలతో విష్ణు ఉన్నాడు. 

ఇదిలా ఉండగా విష్ణు అభిమానులకు చేరువగా ఉండేందుకు సెలెబ్రిటీలు సోషల్ మీడియాని ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఫేస్ బుక్ , ఇన్స్టాగ్రామ్ తరహాలో ప్రస్తుతం టిక్ టాక్ హవా మొదలయింది. సెలెబ్రిటీలంతా టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటున్నారు. 

మంచు విష్ణు తాజాగా టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా ఓ క్రేజీ వీడియోతో అభిమానులని అలరిస్తూ.. మంచు విష్ణు కూర్చుని లాప్ టాప్ చూసుకుంటూ ఉంటాడు. వెనుక మోహన్ బాబు రాయలసీమ రామన్న చౌదరి స్టిల్ ఉంటుంది. 

సడెన్ గా మంచు విష్ణు అంతరాత్మ బయటకు వస్తుంది. అందరూ టిక్ టాక్ ఫాలో అవుతున్నారు.. నువ్వు కూడా రావచ్చు కదా అని విష్ణుకి చెబుతుంది. మరో మూడు నాలుగు ఆత్మలు అతడి నుంచి బయటకు వచ్చి టిక్ టాక్ గురించి చెబుతాయి. దీనితో మంచు విష్ణు తన అంతరాత్మ చెప్పినట్లుగా టిక్ టాక్ లోకి వచ్చినట్లు అభిమానులతో అంటాడు. ఈ వీడియో నెటిజెన్లని ఆకట్టుకుంటోంది. 

@vishnumanchu

Hello, Tik Tok!! I’m here, let’s have some fun ##tiktokindia

♬ original sound - vishnumanchu