ప్రస్తుతం తెలుగు నాట సినిమాలకే కాదు.. వెబ్‌ సిరీస్‌లకూ ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో స్టార్‌ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్‌ సిరీస్‌లు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పెద్ద నిర్మాణ సంస్థలు వీటిని నిర్మించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా హీరో మంచు విష్ణు కూడా ‘చదరంగం’ పేరుతో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మిస్తున్నారు. ఈ సీరిస్ లో శ్రీకాంత్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నారు.  రీసెంట్ గా  ఈ వెబ్ సిరీస్ కి సంబంధించినటువంటి ట్రైలర్ విడుదలయింది.  

ఈ ట్రైలర్ ని చూస్తే ఈ వెబ్ సిరీస్ మొత్తం పూర్తిగా రాజకీయ పరిస్థితులు ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో నాగినీడు, కౌసల్య, సునయన వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు రాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ట్రైలర్ చూసిన వాళ్లు ...ఫలనా రాజకీయ నాయకుడుని టార్గెట్ చేస్తూ ఈ వెబ్ సీరిస్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో గెస్ చేయండి.

‘‘కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందనుంది.. ఇది కొంత మందికి షాక్‌ ఇస్తుంది’’ అని మంచు విష్ణు  చెప్తున్నారు.