స్టార్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో మంచు విష్ణు. హీరోగా స్టార్ ఇమేజ్‌ అందుకోలేకపోయినా కామెడీ ఎంటర్‌టైనర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విష్ణు. అదే సమయంలో నిర్మాతగా, వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు ఈ యంగ్ హీరో. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే విరానికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మంచు విష్ణు.

వీరికి ఇప్పటికే నలుగురు పిల్లలున్నారు. 2009లో పెళ్లి చేసుకున్న విష్ణుకు 2011లో కవలలు జన్మించారు. ఆ తరువాత 2018లో ఓ బాబు, 2019లో తిరిగి ఓ పాపకు జన్మించారు. ఈ జనరేషన్‌లో హీరోగా ఏకంగా నలుగురు పిల్లలున్న ఒకే ఒక్క నటుడు మంచు విష్ణు కావటం విశేషం. దీంతో మంచు విష్ణు సంతానంపై చాలా రోజులుగా ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అభిమాని ఏకంగా మంచు విష్ణునే ఈ ప్రశ్న అడిగాడు.

లాక్‌ డౌన్‌లో భాగంగా ఖాళీగా ఉంటుంన్న మంచు విష్ణు బుధవారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని `మీ తదుపరి పాప కోసం ఎదురు  చూస్తున్నాం` అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కు రిప్లైగా.. `ఈ సమయంలో విరానికా ఇక్కడే నాతో ఉండి ఉంటే మరో 9 నెలల్లో మరో చిన్నారి వచ్చేది` అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు. ఈ కామెంట్‌పై విరానికా కూడా స్పందించింది. `యా రైట్` అంటూ కామెంట్ చేసింది విరానికా.