గత కొన్నాళ్లుగా వరుస అపజయాలతో సతమతమవుతున్న మంచు విష్ణు ఈ సారి కెరీర్ లో బెస్ట్ హిట్ అందుకోవాలని ట్రై చేస్తున్నాడు. మంచు విష్ణు ప్రస్తుతం ఒక హాలీవుడ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని భారీ స్థాయిలో విష్ణు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ కి చెందిన ప్రముఖ టెక్నీషియన్స్ ఈ సినిమాను వర్క్ చేస్తున్నారు.

ఇకపోతే రీసెంట్ గా సినిమా షూటింగ్ స్పాట్ లో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సంజయ్ దత్ దర్శనమిచ్చాడు. సినిమాలో సునీల్ శెట్టి కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సడన్ గా షూటింగ్ స్పాట్ కి సంజయ్ రావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో ఈ సీనియర్ హీరో కూడా ఒక ముఖ్య పాత్రలో ఏమైనా నటిస్తున్నాడా అనేది హాట్ టాపిక్ గా మారింది.

చిత్ర యూనిట్ నుంచి అయితే ఇప్పటివరకు సినిమాలో నటిస్తున్న వారి వివరాలని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయలేదు.  ఇక ఇప్పుడు సినిమాకు సంబందించిన స్పెషల్ పిక్ బయటకు రావడంతో క్యాస్టింగ్ పై స్పెషల్ హైప్ క్రియేట్ అయ్యింది. సెట్ లో చాలా సేపు సంజయ్ చిత్ర యూనిట్ తో ముచ్చటించినట్లు సమాచారం. ఇక సినిమాకు సంబందించిన షూటింగ్ ఇప్పటికే సగం పూర్తయ్యింది.

జెఫరీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్ ఎంటర్టైన్మెంట్ -AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రూపొందిస్తున్నారు. సునీల్ శెట్టి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది, కాజల్ అగర్వాల్ తో పాటు రుహానీ సింగ్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇంగ్లీష్ - తెలుగులో ఈ సినిమాను ఒకేసారి రిలీజ్ చేయాలనీ విష్ణు ప్రయత్నాలు చేస్తున్నాడు.