Asianet News TeluguAsianet News Telugu

‘సినిమాల్లోలాగే ఇక్కడా ఆదరించండి’.. కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన మంచు మనోజ్ దంపతులు.. డిటేల్స్

మంచు మనోజ్ దంపతులు కొత్త బిజినెస్ ను ప్రారంభించారు. పిల్లలకు టాయ్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించి మొదటి స్టోర్ ను ఓపెన్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. 

Manchu Manoj into Toys Industry with Namaste World brand NSK
Author
First Published Dec 26, 2023, 3:21 PM IST

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ (Manchu Manoj)  కంబ్యాక్ అవుతున్నారు. ఇప్పటికే ‘ఉస్తాద్ గేమ్ షో’తో బుల్లితెరపై హోస్ట్ గా అలరిస్తున్నారు. అటు సినిమాలను కూడా లైన్లో పెడుతున్నారు. ఇక తాజాగా బిజినెస్ లు కూడా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ భార్య భూమా మౌనికా రెడ్డి (Bhuma Mounika Reddy)తో కలిసి టాయ్స్ బిజినెస్ ను ప్రారంభించారు. 

నమస్తే వరల్డ్ బ్రాండ్ (Namasthe World Brand) పేరుతో టాయ్స్ ను మార్కెట్ లో విడుదల చేశారు. చిన్నారుల బొమ్మలను కార్టూన్, యానిమేషన్ రూపంలో తీసుకువచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్ లో నమస్తే వరల్డ్ బ్రాండ్ టాయ్స్ pop up store  ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నమస్తే వరల్డ్ సీఈవో భూమా మౌనిక మంచు మాట్లాడుతూ..  పిల్లల కోసం వచ్చిన ఆలోచన నమస్తే వరల్డ్ తో ముందుకు వచ్చింది. దినికి పూర్తి సహకారం అందించిన నా భర్త మంచు మనోజ్ అందించిన స్పూర్తితోనే ముందుకు వెళ్లానని తెలిపారు. 

భారతీయ హస్తకళ నైపుణ్యం, మహిళా సాధికారత మరియు స్కిల్ డెవలప్ మెంట్ తో నమస్తే వరల్డ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ నమస్తే వరల్డ్ స్టార్టప్ కు సహకరించిన రిలైన్స్ సంస్థకు ప్రత్యేక దన్యావాదలు తెలిపారు. నమస్తే వరల్డ్ పూర్తి స్థాయిలో  కృషి చేసిన అందరికి అభివాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐవో మంచు మనోజ్ మాట్లాడుతూ.. మన ఇప్పటి వరకు విదేశాలకు చెందిన కల్చర్ ను అలవాటు చేసుకున్నామని.. ఇప్పుడు ఇండియన్ కల్చర్ ను ప్రమోట్ చేసేందుకు తనవంతుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మన దేశంలో గొప్పే సంస్కృతి ఉందని.. ఒక్కో కథ ఉందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, కళలను వెలికి తీసేందుకు ఇది చక్కటి ఫ్లాట్ ఫాంగా నిలుస్తుందన్నారు. 

సినిమాల్లో ఆదరించినట్లుగానే.. ఈ కొత్త బిజినెస్ లో ఆదరించాలని కోరారు. మా వెంచర్ మరింత ప్రాముఖ్యతను పొందిందని... నమస్తే వరల్డ్ ఆవిష్కరణలకు సజీవ చిహ్నమైన తమ కొడుకు ధైరవ్ మూల కారణమని ఆయన తెలిపారు. అతని ప్రత్యేక దృక్పథం ప్రతి బిడ్డలోని వ్యక్తిత్వం మరియు సామర్థ్యాన్ని గౌరవించే మరియు పెంపొందించే బొమ్మలను రూపొందించాలనే మా సంకల్పాన్ని బలపరుస్తుందని మనోజ్ తేలియజేశారు. నమస్తే బ్రాండ్ టాయ్స్ దేశంలోని అన్ని జియో ఔట్ లెట్స్ లో లభిస్తున్నాయని.. రిలయన్స్ తో పాటు అన్ని షోరూంలలో అందుబాటులో ఉంచామన్నారు. 

ముంబైలోని జియో గార్డెన్స్‌లోని హామ్లీస్ వండర్‌ల్యాండ్‌లో మన బొమ్మల ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని...  మన భారతీయ-సృష్టించిన బొమ్మలను ప్రపంచ స్థాయికి ఎదగడంలో కీలకమైయ్యిందన్నారు. క్రిస్మస్ సందర్భంగా తన అభిమానులకు అద్బతమైన అవకాశం ఇచ్చారు. చిన్నారులు బొమ్మలు గీసి తమకు పంపిస్తే.. బొమ్మలుగా మార్చి మార్కెట్ లో ఉంచుతామన్నారు. సృజనాత్మకతతో బొమ్మలు తయారు చేసి తమ వెబ్ సైట్ కు పంపిస్తే.. వాటిని బొమ్మలు, యానిమేషన్, గేమింగ్ లో ఉంచి వాటికి ప్రాచుర్యం తీసుకువస్తామన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios