కరోనాతో ప్రపంచమంతా స్థంభించి పోయింది. సాధారణ ప్రజానీకంతో పాటు సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమిత మవుతున్నారు. ఎప్పుడూ షూటింగ్ లు, ప్రయాణాలతో బిజీగా ఉండే టాప్‌ స్టార్లు కూడా ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు. మంచు ఫ్యామిలీ యంగ్ హీరో మనోజ్‌ కూడా తాజాఓ ఇంట్రస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు.

టాలీవుడ్‌ లో టైగర్‌ ఇమేజ్‌ ఉన్న సీనియర్‌ నటుడు మోహన్‌ బాబు. ఇండస్ట్రీలో ఆయన అంటే అందరికీ కాస్త భయంతో కూడిన భక్తి అన్న విషయం తెలిసిందే.  క్రమశిక్షణకు మారుపేరుగా కనిపించే ఆయనతో ఎదురు పడి మాట్లాడేందుకు కూడా ఎవరైనా భయపడతారు. అయితే ఇలాంటి ఇమేజ్‌ ఉన్న మోహన్ బాబుకు సంబంధించి ఓ ఫన్నీ వీడియోను తన సోషల్ మీడియ పేజ్‌లో పోస్ట్ చేశాడు ఆయన తనయుడు మనోజ్‌.

తన భార్య నిర్మలా దేవి పడుకొని ఉండగా ఆ  పక్కనే నిలబడ్డ మోహన్‌ బాబు ఆమెకు గాలి విసురుతున్నాడు. ఈ వీడియోను తో పాటు `డియర్‌ మెన్‌.. మీరు మహిళలకు తిరిగి ఇచ్చేయాల్సిన సమయం ఇది. మీరు కూడా ఇలాంటి వీడియో తీసి మై క్వారెంటైన్‌ టైం (#MyQuanrantineTime) అనే హ్యాష్ ట్యాగ్‌తో పోస్ట్ చేయండి` అనే కామెంట్ ను యాడ్ చేశాడు.

ఇక ప్రొఫెషనల్‌ కెరీర్‌ విషయానికి వస్తే.. కలెక్షన్‌ కింగ్ మోహన్‌ బాబు చాలా కాలంగా సినిమాల విషయంలో సెలక్టివ్‌ గా వ్యవహరిస్తున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన లాంగ్ గ్యాప్ తరువాత సూర్య హీరోగా తెరకెక్కిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో కీలక పాత్రల్లో నటించాడు. ఇక ఆయన తనయులు కూడా సినిమాల్లో బిజీ అవుతున్నారు. విష్ణు హీరోగా అంతర్జాతీయ చిత్రం మోసగాళ్లు షూటింగ్ పూర్తి కాగా, మనోజ్‌ హీరోగా అహం బ్రహ్మాస్మి సినిమా షూటింగ్ ఇటీవల ప్రారంభమైంది.