మంచు మోహన్ బాబు వారసురాలిగా టాలీవుడ్‌ కు పరిచయం అయిన నటి లక్ష్మీ ప్రసన్న. విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె నటిగానేకాక వ్యాఖ్యతగా, నిర్మాతగా కూడా తన ప్రత్యేకను చాటుకుంది. సినిమాలతో పాటు సామాజిక సమస్యలపై స్పందించటంలోనూ ఎప్పుడూ ముందే ఉంటుంది మంచు లక్ష్మీ అదే సమయంలో తనలోని హాస్య చతురతను కూడా చాటుతుంది లక్ష్మీ ప్రసన్న.

తాజాగా కరోనా భయంతో ప్రపంచమంతా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అత్యవసరమైతే తప్ప గడపదాటి బయటకు రావొద్దని కోరుతున్నారు ఈ నేపథ్యంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. పిల్లలు ఇంట్లోనే ఉండటంతో వారిని అదుపు చేయటం తల్లి దండ్రులకు తలకుమించిన భారమవుతోంది. కాస్త అల్లరి చేసే పిల్లు అయితే ఇక వారిని అదుపు చేయటం ఎవరి తరం కావటం లేదు. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఆసక్తికరంగా మారింది.


`స్కూల్‌ సెలవులు మరింత కాలం కొనసాగితే.. శాస్త్రవేత్తల కన్నా ముందే తల్లి దండ్రులు ఈ వైరస్‌కు మందు కనుక్కొంటారు` అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో పోస్ట్ చేసింది మంచు లక్ష్మీ. ఈ పోస్ట్ పై రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సెలబ్రిటీలు కూడా స్పందించారు. గతంలో వరుస సినిమాలో బిజీగా కనిపించినా లక్ష్మీ తరువాత పెద్దగా ఆకట్టుకోలేకపోవటంతో అవకాశాలు తగ్గిపోయాయి. అయితే సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా.. సినిమా ఈవెంట్లు, ప్రైవేట్‌ ఫంక్షన్స్‌ లో తరుచూ దర్శనమిస్తూనే ఉంది ఈ భామ.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

True that.....hehehe #homeschooling

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) on Mar 23, 2020 at 9:50pm PDT